“మహా” ఉత్కంఠకు ముగింపు.. ఇక సీఎంగా..

| Edited By:

Nov 22, 2019 | 9:23 PM

ఎట్టకేలకు మహారాష్ట్రలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. గత కొద్దిరోజులుగా శివసేనతో జతకట్టడంపై ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎటూ తేల్చకుండా నాన్చుతూ.. సస్పెన్స్‌ను కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై క్లారీటీ ఇచ్చారు. మహారాష్ట్ర సీఎంగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే‌ ఉండనున్నట్లు శరద్ పవార్ స్పష్టం చేశారు. దీంతో దాదాపు పదిహేను రోజుల నుంచి నడుస్తున్న డ్రామాకు […]

మహా ఉత్కంఠకు ముగింపు.. ఇక సీఎంగా..
Follow us on

ఎట్టకేలకు మహారాష్ట్రలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. గత కొద్దిరోజులుగా శివసేనతో జతకట్టడంపై ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎటూ తేల్చకుండా నాన్చుతూ.. సస్పెన్స్‌ను కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై క్లారీటీ ఇచ్చారు.

మహారాష్ట్ర సీఎంగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే‌ ఉండనున్నట్లు శరద్ పవార్ స్పష్టం చేశారు. దీంతో దాదాపు పదిహేను రోజుల నుంచి నడుస్తున్న డ్రామాకు తెరదింపినట్లైంది. సీఎం పదవి శివసేన చేపట్టనుండగా.. డిప్యూటీ సీఎం పదవులను కాంగ్రెస్‌, ఎన్సీపీలు చెరొకటి చెపట్టనున్నాయి. అంతేకాదు.. అయిదేళ్ల పాటు సీఎం పదవిని శివసేన పార్టీనే చేపట్టబోతుందని.. కాంగ్రెస్, ఎన్సీపీలు అయిదేళ్లపాటు డిప్యూటీ సీఎం పదవులను చేపట్టబోతున్నట్లు శరద్ పవార్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు అధికారికంగా ప్రకటించనున్నాయి. దీంతో ఇక త్వరలో.. మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా, మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టడం ఇష్టంలేని.. కొందరు శివసేన పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా పరిస్థితి ఎలా ఉండబోతుందో వేచిచూడాల్సిందే.