మహా సీఎంగా ఉద్దవ్ థాక్రే.. డిసెంబర్ 1న పట్టాభిషేకం..!

| Edited By:

Nov 26, 2019 | 8:38 PM

మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపులు తిరిగి ఓ కొలిక్కివచ్చింది. చివరకు ఉద్దవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. హోటల్ ట్రెండెంట్‌లో సమావేశమైన మూడు పార్టీల ఎమ్మెల్యేలు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరి కూటమికి “మహా వికాస్ అఘాడి”గా నామకరణం చేసుకున్నారు. ఈ కూటమికి నేతగా ఉద్దవ్ థాక్రేను ఎన్నుకున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఉద్దవ్.. శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి. ఇక ఉపముఖ్యమంత్రులుగా ఎన్సీపీ […]

మహా సీఎంగా ఉద్దవ్ థాక్రే.. డిసెంబర్ 1న పట్టాభిషేకం..!
Follow us on

మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపులు తిరిగి ఓ కొలిక్కివచ్చింది. చివరకు ఉద్దవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. హోటల్ ట్రెండెంట్‌లో సమావేశమైన మూడు పార్టీల ఎమ్మెల్యేలు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరి కూటమికి “మహా వికాస్ అఘాడి”గా నామకరణం చేసుకున్నారు. ఈ కూటమికి నేతగా ఉద్దవ్ థాక్రేను ఎన్నుకున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఉద్దవ్.. శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి. ఇక ఉపముఖ్యమంత్రులుగా ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, కాంగ్రెస్ పార్టీ నుంచి బాలా సాహెబ్ థోరాట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాగా, బుధవారం ఉదయం 8.00 గంటలకు మహా అసెంబ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే ప్రొటెం( తాత్కాలిక) స్పీకర్‌గా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్‌ కోలాంబకర్‌.. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.