Jharkhand: రాంచీలో ఉద్రిక్తత.. పోలీసులు – నిరసనకారుల మధ్య హింస.. ఇద్దరు మృతి

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దేశవ్యాప్తంగా చెలరేగిన ఘర్షణలు ఇంకా చల్లారలేదు. శుక్రవారం జరిగిన నిరసనలు, ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఘటనకు కారకులైన వారిన వెంటనే అరెస్టు చేయాలని నిరసనకారులు...

Jharkhand: రాంచీలో ఉద్రిక్తత.. పోలీసులు - నిరసనకారుల మధ్య హింస.. ఇద్దరు మృతి
Protest In Ranchi
Follow us

|

Updated on: Jun 11, 2022 | 1:17 PM

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దేశవ్యాప్తంగా చెలరేగిన ఘర్షణలు ఇంకా చల్లారలేదు. శుక్రవారం జరిగిన నిరసనలు, ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఘటనకు కారకులైన వారిన వెంటనే అరెస్టు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‌(Jharkhand) రాజధాని రాంచీ(Ranchi) లో అల్లర్లు జరిగాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా పశ్చిమ బంగ రాష్ట్రంలోని హావ్‌డా లోనూ ఘర్షణలు జరిగాయి. హావ్ డా(Howrah) లో నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై అల్లరిమూకలు రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. నగరంలోని హనుమాన్‌ ఆలయం వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఘర్షణల కారణంగా రాంచీలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సేవలనూ నిలిపివేశారు.

కాగా.. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూపీ, ఢిల్లీలో ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటైన జామా(Jama Masjid) మసీదు వెలుపల ఢిల్లీలో నిరసనలు చెలరేగాయి. నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలతో ఢిల్లీ జామా మసీద్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే పలువురు మసీదు వెలుపలకు వచ్చి, బీజేపీకి(BJP) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. చిన్నపిల్లలతో సహా వందల మంది నూపుర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా.. ఈ నిరసనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జామా మసీద్‌ నిర్వాహకులు వెల్లడించారు.

మరోవైపు.. మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్‌ మీడియా పోస్ట్‌ చేసినందుకు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌పై బీజేపీ వేటు వేసింది. ఈ ఘటనపై దుమారం రేగడంతో నూపుర్‌ క్షమాపణలు కూడా చెప్పారు. అదే సమయంలో వేర్వేరు చోట్ల వీళ్లపై కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే