Test Driving: షోరూమ్‌ నుంచి టెస్ట్ డ్రైవింగ్‌కు కారు తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

|

Sep 26, 2024 | 8:00 PM

సాధారణంగా వాహనాలు కొనుగోలు చేసేందుకు షాపింగ్‌ మాల్‌కు వెళ్లినప్పుడు నచ్చిన వాహనాన్ని సెలెక్ట్ చేసుకుని, టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తుంటారు. అందుకు యజమానుల నుంచి అనుమతి తీసుకుని టెస్ట్‌ డ్రైవ్‌ చేసి, ఆ తర్వాత డబ్బు చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇద్దరు వ్యక్తులు ఓ కారు కొనేందుకు షాప్‌కు వెళ్లారు. అక్కడ ఓ కారును సెలెక్ట్ చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తామని కోరారు..

Test Driving: షోరూమ్‌ నుంచి టెస్ట్ డ్రైవింగ్‌కు కారు తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Test Driving
Follow us on

నోయిడా, సెప్టెంబర్ 26: సాధారణంగా వాహనాలు కొనుగోలు చేసేందుకు షాపింగ్‌ మాల్‌కు వెళ్లినప్పుడు నచ్చిన వాహనాన్ని సెలెక్ట్ చేసుకుని, టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తుంటారు. అందుకు యజమానుల నుంచి అనుమతి తీసుకుని టెస్ట్‌ డ్రైవ్‌ చేసి, ఆ తర్వాత డబ్బు చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇద్దరు వ్యక్తులు ఓ కారు కొనేందుకు షాప్‌కు వెళ్లారు. అక్కడ ఓ కారును సెలెక్ట్ చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తామని కోరారు. దీంతో యజమాని కూడా ఓకే అన్నాడు. అంతే.. ఇద్దరూ ఆ కారులో కూర్చుని సర్రున బయటికి వెళ్లారు. అయితే ఎంతకూ వారు తిరిగి రాలేదు. దీంతో కారుతో ఉడాయించారని ఆలస్యంగా అర్ధం చేసుకున్న సదరు యజమాని లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం (సెప్టెంబర్‌ 26) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో సెకెండ్‌ హ్యాండ్‌ కార్ల షోరూమ్‌కు గురువారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. షోరూమ్‌ మొత్తం తిరిగి తమకు ఎస్‌యూవీ కారు కావాలని అడిగారు. టెస్ట్ డ్రైవ్‌ చేయాలని వారు యజమానిని అడిగారు. తమ సిబ్బంది ఒకరిని వెంట తీసుకెళ్లమని చెప్పి.. టెస్ట్‌ డ్రైవ్‌కి ఆ కారును ఇచ్చారు. కొద్ది దూరం వెళ్లాక షోరూమ్‌ ఉద్యోగిని కారు నుంచి కిందకి తోసేసి, ఆ ఇద్దరు వ్యక్తులు కారుతో ఉడాయించారు. ఇద్దరు వ్యక్తులు కారును డ్రైవింగ్‌కు తీసుకెళ్తున్న వీడియోలు షోరూమ్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరీల్లో రికార్డయ్యాయి. కారును బయటికి తీసుకెళ్లిన వారు ఎంతకూ తిరిగా రాకపోవడంతో షోరూం యాజమన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న నాలెడ్జ్ పార్క్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కారు యజమానులు, కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి మధ్య ఏదైనా వివాదం తలెత్తిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కారు వారికి అప్పగించే ముందు కొనుగోలుదారుడి వివరాలేమీ తెలుసుకోలేదని యజమాని చెప్పడంతో దుండగుల గుర్తింపు కనుక్కోవడం సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.