ఢిల్లీ, హర్యానాలో భూప్రకంపనలు…రెండు సార్లు కంపించిన భూమి…

కరోనా భయంతో వణికిపోతున్న ఢిల్లీ, హర్యానా వాసులను మరో భయం వెండాడింది. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. కేవలం గంట సమయంలో రెండు సార్లు వరసగా పెద్ద శబ్ధంతో భూమి కంపించింది. హర్యానా రాష్ట్రంలోని రోహతక్ నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలాజీ వెల్లడించింది. అయితే ఢిల్లీ పరిసరప్రాంతాల్లో 50 కిలోమీటర్ల మేర ఈ తీవ్రత […]

ఢిల్లీ, హర్యానాలో భూప్రకంపనలు...రెండు సార్లు కంపించిన భూమి...
Earthquake

Updated on: May 30, 2020 | 10:38 AM

కరోనా భయంతో వణికిపోతున్న ఢిల్లీ, హర్యానా వాసులను మరో భయం వెండాడింది. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. కేవలం గంట సమయంలో రెండు సార్లు వరసగా పెద్ద శబ్ధంతో భూమి కంపించింది. హర్యానా రాష్ట్రంలోని రోహతక్ నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలాజీ వెల్లడించింది. అయితే ఢిల్లీ పరిసరప్రాంతాల్లో 50 కిలోమీటర్ల మేర ఈ తీవ్రత కనిపించింది. వచ్చిన భూకంపం 5 కిలోమీటర్ల లోతు నుంచి వచ్చిందని అధికారులు వెల్లడించారు. రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9 గా నమోదైంది. ఢిల్లీ ప్రాంతంలో ఈ నెలలో నాలుగుసార్లు భూమి కంపించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us