దేశంలో 28 కరోనా పాజిటివ్ కేసులు.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్

| Edited By: Anil kumar poka

Mar 04, 2020 | 1:35 PM

దేశంలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. గత నెల 21 న ఇటలీ నుంచి టూరిస్టుల బృందమొకటి ఇండియా వచ్చిందని, వీరిలో 16 మందికి కరోనా లక్షణాలున్నట్టు తేలిందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో 28 కరోనా పాజిటివ్ కేసులు.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్
Follow us on

దేశంలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. గత నెల 21 న ఇటలీ నుంచి టూరిస్టుల బృందమొకటి ఇండియా వచ్చిందని, వీరిలో 16 మందికి కరోనా లక్షణాలున్నట్టు తేలిందని ఆయన పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్ఛే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఢిల్లీలో ఐసొలేషన్ సెంటర్లను అందుబాటులో ఉంచామని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తే సులువుగా ఈ వ్యాధిని నివారించవచ్చునని హర్షవర్ధన్ అన్నారు. అటు-ఢిల్లీలోని నిర్మల్ భవన్ లో మంత్రుల బృందమొకటి ప్రత్యేకంగా కరోనా నివారణకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించనుంది.