
W.I.T.T.. వాట్ ఇండియా థింక్స్ టుడే. ఇవాళ ఇండియా ఏం ఆలోచిస్తోంది? ఇదీ థీమ్. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది. వరుసగా మూడోసారి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోదీ.. సదస్సును ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న సమ్మిట్‌లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రెండోవ రోజు కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు.
టీవీ9 భారత్‌వర్ష్ సత్తా సమ్మేళనం మంగళవారం, మార్చి 24న జరగుతున్న సదస్సులో బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆ యోగా గురువు కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశంలో చలి తెలియని ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఒకరు మీరు, మరొకరు రాహుల్ గాంధీ?” అని బాబా రామ్‌దేవ్‌ను వ్యాఖ్యాత ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయన సమాధానంగా, “నేను కాఫీ గానీ, టీ గానీ తాగను, జిమ్‌కు గానీ, విదేశాలకు గానీ వెళ్ళను. నాకు ఎలాంటి రహస్య సంబంధాలు లేవు. నా వ్యవహారం మొత్తం బహిరంగ ఎజెండా” అని బాబా రాందేవ్ అన్నారు. రాహుల్ గాంధీ కూడా వేడితో నిండి ఉంటారని రామ్‌దేవ్ సరదాగా చమత్కరించారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో నిరంతరం గందరగోళం సృష్టిస్తూ ఉంటారు.
“ఇద్దరి నిజస్వరూపం తెలుసుకోవాలంటే, వారిని ముఖాముఖిగా నిలబెట్టండి. అప్పుడే వారి యుద్ధ కళలు, కుస్తీ నైపుణ్యాలు బయటపడతాయి. వారిద్దరూ ఒకరినొకరు కింద పడేసుకుంటే, అసలు విషయం స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం తెలుసు. ఫిట్‌నెస్ చాలా అవసరం. రాహుల్ గాంధీ గురించి నేను చెప్పేది ఒక్కటే. ఆయన తన శారీరక ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ రాజకీయంగా పోరాటం కొనసాగించాలి. ఎందుకంటే, అధికార, ప్రతిపక్ష పార్టీల బలంపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. ఆయనకు మా శుభాకాంక్షలు.” అని బాబా రాందేవ్ సమాధానం ఇచ్చారు.
అంతేకాకుండా, “లౌకిక జీవితంలోని కల్లోలాలను లెక్కచేయను. ప్రపంచం శత్రువుగా మారినా, నా కర్తవ్యం నుండి నన్ను ఎవరూ నిరోధించలేరు.” అని బాబా రామ్‌దేవ్ ఇలా అన్నారు. “ఓటర్లుగా కాదు, నాయకులుగా అవ్వండి. మీరు అంతర్గతంగా బలహీనంగా లేనప్పుడు, శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా, ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాను అని దేశ ప్రజలకు బాబా రామ్‌దేవ్ పిలుపునిచ్చారు. బలంగా ఉండండి, బలహీనంగా ఉండవద్దు. మీరు బలహీనపడితే, ప్రపంచం మిమ్మల్ని చంపుతుందని వేదాలు చెబుతున్నాయన్నారు. శక్తిహీనంగా, త్యాగరహితంగా మారిన కులాలు, వర్గాలు, సమాజాల వల్ల దేశాలు నశించిపోతాయన్నారు.
పతంజలి ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా అవతరిస్తుందని బాబా రామ్‌దేవ్ స్పష్టం చేశారు. రష్యాతో పతంజలి ఒప్పందం గురించి బాబా రామ్‌దేవ్‌ను ప్రశ్నించగా, భారతదేశ సూత్రాలకు, భారతీయ ఉత్పత్తులకు విదేశాలలో గిరాకీ ఉందని ఆయన బదులిచ్చారు. భారతదేశం పెట్టుబడిదారీ విధానాన్ని గానీ, నిరంకుశత్వాన్ని గానీ విశ్వసించదు. అందుకే ఇది మరింత పెరగనుంది. భారతదేశం ప్రపంచాన్ని ఒక మార్కెట్‌గా కాకుండా తన కుటుంబంగా భావిస్తుందని రాందేవ్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో, యావత్ ప్రపంచం సహజ వైద్యం, ఆధ్యాత్మికత ఆలోచనలను స్వీకరిస్తోందన్నారు. ఒకనాడు పతంజలి ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసిజి (ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) బ్రాండ్‌గా అవతరిస్తుందని, అది భారతదేశానికే సాధ్యమవుతుందని బాబా రామ్‌దేవ్ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..