‘ఈ రోజు ఒక శుభదినం.. అంబేడ్కర్ విగ్రహం, పార్కు, గ్రంధాలయం జీవో రిలీజ్’

|

Sep 17, 2020 | 7:02 PM

ఈ రోజు ఒక శుభదినం అన్నారు తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. నవభారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి సంబంధించిన జీవో విడుదలైన రోజు ఇవాళ అని ఆయన తెలిపారు.

ఈ రోజు ఒక శుభదినం.. అంబేడ్కర్ విగ్రహం, పార్కు, గ్రంధాలయం జీవో రిలీజ్
Follow us on

ఈ రోజు ఒక శుభదినం అన్నారు తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. నవభారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి సంబంధించిన జీవో విడుదలైన రోజు ఇవాళ అని ఆయన తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ విగ్రహ నమూనాను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించిన సందర్భంలో కొప్పుల అంబేడ్కర్ విగ్రహ విశేషాలను వివరించారు. ఈ భారీ విగ్రహం ఏర్పాటు అనుమతులకు సంబంధించి జీవో నంబర్ 2 విడుదలైందని మంత్రి చెప్పారు. ఇందుకోసం 140 కోట్ల రూపాయల ఖర్చవుతుందని.. హుస్సేన్ సాగర్ సమీపం లో 11 ఎకరాల స్థలం లో అంబేడ్కర్ పార్కు ఏర్పాటు అవుతుందని కొప్పుల వెల్లడించారు. ఈ పార్కు లో విగ్రహంతో పాటు, మ్యూజియం, గ్రంధాలయం కూడా ఉంటాయని స్పష్టంచేశారు. విగ్రహం 45.5 అడుగుల వెడల్పు ఉంటుందని.. ఈ విగ్రహానికి వాడే స్టీలు 791 టన్నులని.. విగ్రహానికి వాడే ఇత్తడి …96 మెట్రిక్ టన్నులని మంత్రి చెప్పారు. ఇలాఉండగా, బాబా సాహెబ్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.