TRS vs BJP: వరి వార్ ఉధృతం చేసిన టీఆర్ఎస్.. పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్‌ నోటీసులు!

|

Apr 04, 2022 | 12:06 PM

ఇప్పటికే వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తీవ్ర వాగ్వాదానికి దిగిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీపై దాడిని మరింత ఉధృతం చేసింది.

TRS vs BJP: వరి వార్ ఉధృతం చేసిన టీఆర్ఎస్.. పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్‌ నోటీసులు!
Rajya Sabha
Follow us on

TRS vs BJP: ఇప్పటికే వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తీవ్ర వాగ్వాదానికి దిగిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీపై దాడిని మరింత ఉధృతం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడుకి నోటీసులు అందజేశారు. రైతుల వ్యతిరేక ప్రకటనలు చేశారని ఆయనపై అవిశ్వాసం ప్రకటించారు. ఏప్రిల్ 1న ప్రశ్నోత్తరాల సమయంలో ఉప్పుడు బియ్యం ఎగుమతుల అంశంపై సభను తప్పుదోవ పట్టించే జవాబు ఇచ్చారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

డబ్ల్యూటివో నియమావళి నేపథ్యంలో పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతులు చేయలేమని కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని టీఆర్ఎస్ ఎంపీలు ధ్వజమెత్తారు. కానీ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మిలియన్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఉందని పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా యావత్ భారతావనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పడు సమాచారం ఇచ్చారని టీఆర్ఎస్ ఎంపీ విమర్శించారు.

మరోవైపు,  పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనలకు దిగారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. క్వశ్చన్‌ అవర్‌లో అడుగడుగునా అడ్డు తగిలారు. బచావో బచావో కిసాన్‌ కో బచావో అంటూ నినాదాలు చేశారు. ఐతే స్పీకర్‌ వారిని కూర్చోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ సభ నుంచి వాకౌట్‌ చేశారు

Read Also… CNG Price Hike: సామాన్యుడికి మరోసారి షాక్.. పెరిగిన CNG ధర.. నాలుగు రోజుల్లో రెండోసారి!