Maoist Leader: మావోలకు షాక్.. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత భార్యతో సహా అరెస్ట్..

|

Nov 12, 2021 | 5:59 PM

Maoist Leader Prashant Bose: వరసగా మావో కార్యక్రమాలకు షాక్ తగులుతుంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాను అరెస్టు చేసినట్లు జార్ఖండ్..

Maoist Leader: మావోలకు షాక్.. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత భార్యతో సహా అరెస్ట్..
Maoists Leaders Prashanth B
Follow us on

Maoist Leader Prashant Bose: వరసగా మావో కార్యక్రమాలకు షాక్ తగులుతుంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాను అరెస్టు చేసినట్లు జార్ఖండ్ పోలీసులు తెలిపారు. కిషన్ దాను తలపై కోటి రూపాయల రివార్డ్ కూడా ఉంది. ఆయన్ని గురించి ఆచూకీ చెప్పినవారికి కోటి రూపాయల బహుమతిని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పక్క సమాచారంతోనే తాము కిషన్ దాను తో పాటు ఆయన భార్య షీలా మరాండీ, మావోయిస్టు పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.  ప్రశాంత్ బోస్ తో పాటు ఆయన భార్య షీలా మరాండీ, సీనియర్ మావోయిస్టు నేతను కూడా తదుపరి విచారణ కోసం రాంచీ కి తీసుకుని వెళ్తున్నామని పోలీసు అధికారి చెప్పారు.

కిషన్ దాను అత్యంత సీనియర్ మావోయిస్టు నాయకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సెంట్రల్ క‌మిటీ మెంబ‌ర్‌, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిల‌ట‌రీ క‌మిష‌న్, ఈస్ట్రన్ రీజిన‌ల్ బ్యూరో సెక్రట‌రీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతే కాదు నార్త్ ఈస్ట్ స్టేట్స్‌తో పాటు బీహార్, జార్ఖండ్‌, బెంగాల్, ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు.  ప్రశాంత్ బోస్ వయస్సు దాదాపు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ బోస్ జార్ఖండ్‌లోని స‌రందా అడ‌వుల నుంచి పార్టీ కార్యక‌లాపాల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.  అయితే 2004లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI)కి నాయకత్వం కిషన్ దాను వహించేవారని తెలుస్తోంది.

ప్రశాంత్ బోస్ పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ ప్రాంతానికి చెందినవారు. కిషన్ దాను నిర్భయ్, కిషన్, కాజల్ , మహేష్ వంటి మారుపేరులతో కూడా పిలుస్తారు.

60 ఏళ్ల వయస్సు గల ప్రశాంత్ బోస్ భార్య షీలా మరాండీ కూడా మరో అగ్ర నక్సలైట్ నాయకురాలు. ప్రస్తుతం కేంద్ర కమిటీ (CC) సభ్యురాలు. అంతకుముందు 2006లో ఒడిశాలో అరెస్టు అయిన ఆమెను రూర్కెలా జైలు నుంచి విడుదల చేశారు. అయితే షీలా మరాండీ ఐదేళ్ల క్రితం సీపీఐ (మావోయిస్ట్)లోకి తిరిగి చేరినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సీపీఐ మావోయిస్టుకు అనుబంధంగా ఉన్న మహిళా సంఘాలకు మార్గనిర్దేశం చేసేందుకు షీలా మరాండీ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారని భావిస్తున్నారు. షీలా మరాండి జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాకు చెందినవారు, షీలా మరాండీను హేమ, ష్పబడి, ఆశా, బుధాని మరియు గుడ్డి అని పిలుస్తారు.

Also Read:

యజమాని ఎలా డ్యాన్స్ చేస్తే.. అలాగే చేస్తున్న కుక్కపిల్ల.. క్యూట్‌ డాన్స్‌.. వీడియో వైరల్‌

 నా పెళ్ళికి రండి.. భోజనం చేసి రూ. 7,300 చెల్లించండి .. పిల్లల్ని తీసుకుని రావద్దు.. కండిషన్స్ అప్లై.. ఎక్కడంటే..

Chennai Floods: విధి నిర్వహణలో తెగువను ప్రదర్శించిన తమిళనాడు లేడీ సూపర్ పోలీస్‌కు ప్రశంసల వెల్లువ..