Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఓ ఉగ్రవాది సహా జైషే తోయిబా టాప్ కమాండర్ హతం

| Edited By: Janardhan Veluru

Jul 19, 2021 | 10:20 AM

జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాద సంస్థ జైషే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ ఇష్ ఫాక్ దర్ అలియాస్ అబూ అక్రమ్ సహా మరో టెర్రరిస్టు మరణించాడు.

Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఓ ఉగ్రవాది సహా  జైషే తోయిబా టాప్ కమాండర్ హతం
Kashmir Encounter
Follow us on

జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాద సంస్థ జైషే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ ఇష్ ఫాక్ దర్ అలియాస్ అబూ అక్రమ్ సహా మరో టెర్రరిస్టు మరణించాడు. షోపియన్ లోని చెక్ సాదిఖ్ ఖాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, లొంగి పోవలసిందిగా హెచ్చరించినప్పటికీ వారు వినకుండా కాల్పులు జరిపారని కాశ్మీర్ ఐజీపీ విజయ కుమార్ తెలిపారు. దీంతో భత్రదళాలు జరిపిన ఫైరింగ్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు ఆయన చెప్పారు. వీరిలో ఒకరిని అబూ అక్రమ్ గా గుర్తించినట్టు ఆయన చెప్పారు. ఘటనా స్థలం నుంచి పలు అనుమానాస్పద డాక్యుమెంట్లను, ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 2017 నుంచి అబూ అక్రమ్ ఈ జిల్లాలో చురుకుగా తన ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని విజయ్ కుమార్ పేర్కొన్నారు.

అయితే తన కార్యకలాపాల గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా వీటిని కొనసాగిస్తూ వచ్చాడని.. ఎప్పటికప్పుడు పాక్ ఐఎస్ఐకి సమాచారం పంపుతూ వచ్చాడని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఈ జిల్లాలో పలువురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఈ నెల 16 న శ్రీనగర్ లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. తాము ఎంతగా నిఘా పెడుతున్నప్పటికీ స్థానికుల్లో కొందరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుండడంతో సమస్య ఏర్పడుతోందని భద్రతాదళ వర్గాలు తెలిపాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Sadhguru: బైక్‌ రైడర్‌గా మారిన జగ్గీవాసుదేవ్‌..!! చూస్తే అవాక్కే..!! వీడియో

Actress Poorna: ఢీ కొరియోగ్రాఫర్‌తో పూర్ణ సూపర్‌ డ్యాన్స్‌.. నెట్టింట వీడియో వైరల్..