
Toll Free Number: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దేశంలో ఎంతో విజయవంతంగా అమలు అవుతోంది. ఈ పథకం ద్వారా ఎంతో మందికి ఉపాధినిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి వారికి ఈ పథకం వరంగా మారుతోంది. అయితే కేంద్ర సర్కార్ ఇటీవల ఈ స్కీమ్ పేరు వీబీ జీరామ్‌జీ పథకంగా మార్చిన విషయం తెలిసిందే. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గతంలో ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తుండగా, ఇప్పుడు 125 రోజులకు పెంచింది కేంద్రం. అలాగే ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనాన్ని కూడా పెంచారు. గతంలో ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.250 వేతనం అందించేవారు. కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని 307 రూపాయలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.
ఈ ఉపాధి హామీ పథకం కింద ప్రతి మరింత మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఇందులో భాగంగా కూలీల కోసం ఇప్పుడు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే టోల్ ఫ్రీ నంబర్. ఉపాధి కూలీలు ఏదైనా ఫిర్యాదు చేసేందుకు కేంద్రం18002001001 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. సాధారణంగా ఉపాధి హామీ కూలీలకు పని చేసే ప్రదేశంలో కొన్ని వసతులు కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, పనిముట్లు, మౌలిక వసతులను నిబంధనల ప్రకారం కల్పించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Bank Loan: SBI నుండి రూ.40 లక్షల హోమ్ లోన్ కోసం మీకు ఎంత జీతం ఉండాలి? నెలవారీ EMI ఎంత?
అయితే ఇలాంటి సదుపాయాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పని చేసే ప్రదేశంలో ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ టోల్ ప్రీ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. కూలీల కోసం సరైన సదుపాయాలు లేకపోయినా, సరైన బిల్లులు చెల్లించకపోయినా ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగించి ఫిర్యాదు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Home Loan: ఈ ఒక్క పని చేస్తే రూ.50 లక్షల రుణంపై రూ.18 లక్షలు ఆదా.. బ్యాంకర్లు కూడా ఆశ్చర్యపోతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి