మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ పులి నదిలో దూకేసింది. 35 అడుగుల ఎత్తు నుంచి సిర్నా నదిలోకి దూకిన పులి మృత్యువాతపడింది. అయితే, ఎత్తైన వంతెన మీది నుంచి దూకటం, పులి దూకిన ప్రదేశంలో బండరాళ్లు అధికంగా ఉండటంతో దానికి వెన్నుముక విరిగి ఉంటుందని, అందుకే చనిపోయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. నదిలో కొట్టుమిట్టాడుతున్న పులిని కాపాడేందుకు అటవీశాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సిర్నా నదిలో రాళ్ల మధ్య దాని మృతదేహం కనిపించగా ఎట్టకేలకు అధికారులు దానిని బయటకు తీశారు. పులి మృతికి గల కారణాలపై ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నట్లుగా వివరించారు.