Amrit Bharat Express: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఈ రూట్లోనే ప్రయాణం

ఏపీ ప్రజలకు మరో మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు త్వరలో అందుబాాటులోకి రానున్నాయి. ఇవి తమిళనాడు నుంచి మొదలై ఏపీ మీదుగా పశ్చిమబెంగాల్‌కు వెళ్లనున్నాయి. మరికొద్దిరోజుల్లో ప్రధాని మోదీ ఈ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. వీటి వివరాల్లోకి వెళ్తే..

Amrit Bharat Express: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఈ రూట్లోనే ప్రయాణం
Amrit Bharat Express

Updated on: Jan 11, 2026 | 3:51 PM

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ గుడ్‌న్యూస్ అందించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు భారీ గిఫ్ట్ ప్రకటించింది. కొత్తగా మరో మూడు రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఉపయోగపడేలా పలు నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో భాగంగా తమిళనాడు నుంచి కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మూడు రైళ్లు తమిళనాడు నుంచి బయల్దేరి ఏపీ మీదుగా పశ్చిమబెంగాల్ వరకు వెళతాయి. దీంతో ఏపీలోని ప్రజలకు లాభం జరగనుంది. ఈ మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్స్‌తో పాటు ఏయే ప్రాంతాల మీదుగా వెళతాయనేది ఇప్పుడు చూద్దాం.

ఏపీ ప్రజలకు పండగే

తిరుచిరాపల్లి నుంచి పశ్చిమబెంగాల్‌లోని న్యూ జల పాయ్ వరకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నడపనున్నారు. ఈ రైలు చిదంబరం, తాంబరం, చెన్నై ఎగ్మోర్, చెంగల్పట్లు, విల్లుపురం, కడలూరు, మైలాడుథురై, కుంభకోణం, తంజావూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. ఇక రెండో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ తాంబరం-సంత్రాగచ్చి మధ్య సర్వీసులు అందించనుంది. ఈ రైలు చెన్నై ఎగ్మోర్, విజయవాడ, ఖరగ్‌పూర్, భువనేశ్వర్ స్టేషన్లలో ఆగుతుంది. ఇక వీటిల్లో మూడో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నా‌గకోయిల్-న్యూ జలపాయ్ మధ్య నడుస్తోంది. ఈ రైలు దిండిగల్, మధురై, విరుధ్ నగర్, పళని, ఉడుమాల్ పేట, పొల్చాచ్చి, కోయంబత్తూర, తిరుప్పూర్, సేలం, ఈరోడ్ మీదుగా ప్రయాణించి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్ పూర్ మీదుగా ప్రయాణం సాగిస్తోంది.

త్వరలో మోదీ చేతుల మీదుగా ప్రారంభం

ఈ మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీని వల్ల తమిళనాడు, ఏపీ, పశ్చిమబెంగాల్ ప్రజలకు లాభం జరగనుంది. ఇప్పటికే సామాన్యుల కోసం దేశవ్యాప్తంగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.