తొలి దశలో మూడు విమానాశ్రయాలు ప్రైవేటు పరం, కేంద్రం

| Edited By: Pardhasaradhi Peri

Aug 19, 2020 | 7:32 PM

దేశంలో తొలి దశలో జైపూర్, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్..

తొలి దశలో మూడు విమానాశ్రయాలు ప్రైవేటు పరం, కేంద్రం
Follow us on

దేశంలో తొలి దశలో జైపూర్, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రకాష్ జవదేకర్.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) కింద ఈ మూడు ఎయిర్ పోర్టులను లీజుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహణకు నేషనల్ రిక్రూట్ ఏజన్సీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. అటు-మరిన్ని ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణపై యోచిస్తున్నామని, మరో పదేళ్ల కల్లా దేశంలో వంద ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.