Uttar pradesh: డీజేను అడ్డుకున్నారనే కోపంతో ప్రార్థనా మందిరంలో బాంబు పెట్టిన యువకుడు.. అక్కడంతా భయానకం..

|

Sep 08, 2022 | 6:35 PM

వెంటనే పోలీసు బృందం ఆ ప్రాంతంలో పహారా కాస్తూ శాంతి భద్రతలను పరిరక్షించింది.  పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 24 గంటల్లో..

Uttar pradesh: డీజేను అడ్డుకున్నారనే కోపంతో ప్రార్థనా మందిరంలో బాంబు పెట్టిన యువకుడు.. అక్కడంతా భయానకం..
Uttar Pradesh
Follow us on

Uttar pradesh: డీజే ఆడకుండా మతపెద్దలు అడ్డుకోవడంతో ఆ యువకుడు మసీదును బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ బరేలీలో చోటు చేసుకుంది. ఘటన తర్వాత పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది. విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బాంబు బెదిరింపుల కేసులో ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జామా మసీదుపై బాంబు దాడి చేస్తానని, మౌలానాను కాల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. అదే సమయంలో పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.అయితే, ఆ రోజు ఉదయం మసీదు వెలుపల ఒక పోస్టర్ ప్రత్యక్షమైంది. దానిపై శుక్రవారం రోజున మసీదును బాంబుతో పేల్చివేస్తామని రాసి ఉంది..దీంతో పాటు మౌలానాను కూడా కాల్చి చంపేస్తామంటూ రాశారు.. ఈ విషయం తెరపైకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నమాజు కోసం వచ్చిన వారంతా భయంతో హడలెత్తిపోయారు. బాంబు పుకారుతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులకు సమాచారం అందిచంటంతో..హడావుడిగా పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది.

వెంటనే పోలీసు బృందం ఆ ప్రాంతంలో పహారా కాస్తూ శాంతి భద్రతలను పరిరక్షించింది.  పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 24 గంటల్లో నిందితుడ్ని పట్టుకున్నారు. తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఊరేగింపులో డీజే ఆడడం నిషిద్ధమని ఆంక్షలు విధించటంతో కోపోద్రిక్తుడై యువకుడు ఇలా పోస్టర్‌ అంటించినట్టుగా చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి