CAA Protests: సీఏఏపై పెల్లుబికిన నిరసన.. ముంబైలో జన ప్రభంజనం

CAA Protests:  సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీ‌ఆర్‌లకు నిరసనగా జనం వెల్లువెత్తారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో శనివారం వేలాదిమంది భారీ ప్రదర్శన చేశారు. ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దేఖేంగే’ కవితను ఆలపిస్తూ..ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా‌లకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ‘ మహామోర్చా’ సముద్రాన్ని తలపించింది. నగర శివార్లలోని నవీ  ముంబై, థానేతో బాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి తండోపతండాలుగా నిరసనకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సీఏఏ, […]

CAA Protests: సీఏఏపై పెల్లుబికిన నిరసన.. ముంబైలో జన ప్రభంజనం

Edited By:

Updated on: Feb 16, 2020 | 11:20 AM

CAA Protests:  సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీ‌ఆర్‌లకు నిరసనగా జనం వెల్లువెత్తారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో శనివారం వేలాదిమంది భారీ ప్రదర్శన చేశారు. ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దేఖేంగే’ కవితను ఆలపిస్తూ..ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా‌లకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ‘ మహామోర్చా’ సముద్రాన్ని తలపించింది. నగర శివార్లలోని నవీ  ముంబై, థానేతో బాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి తండోపతండాలుగా నిరసనకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీ‌ఆర్‌ల వ్యతిరేక బ్యానర్లు, ప్లకార్డులను పట్టుకున్న వీరు.. మోదీ, అమిత్ షా లనుంచి, ఈ చట్టాల నుంచి తమను విముక్తులను చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌పీ‌ఆర్ అమలు చేస్తున్నప్పుడు తమ డాక్యుమెంట్లు ఏవీ చూపబోమని నిరసనకారులు తీర్మానించారు. మేము ఎప్పటినుంచో భారతీయులమే అని స్పష్టం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే సీఏ ఏ ని రద్దు చేయాలని కూడా కోరారు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా హాజరైన  ఈ మహా మోర్చాలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, నటుడు సుశాంత్ సింగ్ తదితరులు కూడా పాల్గొన్నారు.