తిండి లేక.. నిలువనీడ లేక.. వలసకూలీల వెతలు

| Edited By: Anil kumar poka

Mar 29, 2020 | 12:12 PM

కరోనా నివారణకు మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో.. ఢిల్లీ, బీహార్ తదితర రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుబడిపోయిన వేలాది వలసకూలీల బతుకులు దుర్భరంగా మారాయి. తిండి లేదు.. ఉపాధి లేదు.. చేతిలో నాలుగు రూకలు లేవు...

తిండి లేక.. నిలువనీడ లేక.. వలసకూలీల వెతలు
Follow us on

కరోనా నివారణకు మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో.. ఢిల్లీ, బీహార్ తదితర రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుబడిపోయిన వేలాది వలసకూలీల బతుకులు దుర్భరంగా మారాయి. తిండి లేదు.. ఉపాధి లేదు.. చేతిలో నాలుగు రూకలు లేవు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కనీసం మళ్ళీ తమతమ గ్రామాలకు వెళ్లాలన్నా బస్సులు గానీ రైళ్లు గానీ లేవు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో వీరి గమ్యానికి ఒక పరిష్కారమంటూ లేకపోయింది. తాము చేయని తప్పుకు ఈ బడుగుజీవులంతా శిక్ష అనుభవిస్తున్నారు. లాక్ డౌన్ అమలవుతున్న నాలుగోరోజున కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త ఆలస్యంగా మేల్కొన్నాయి. యూపీ ప్రభుత్వం వీరికోసం వెయ్యి బస్సులను ఏర్పాటు చేయగా,, ఢిల్లీ సర్కార్ అదనంగా 200 బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో ఢిల్లీ బస్ స్టేషన్ వద్ద శనివారం  సాయంత్రం వేలమంది శ్రామికులు గుంపులు, గుంపులుగా చేరుకున్నారు. వందల కిలోమీటర్ల దూరం నడవలేక అనేకమంది సొమ్మసిల్లిపోయారు. వీరిలో పురుషులు, మహిళలు కూడా ఉన్నారు. ఈ దారుణ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపిస్తూ.. తన ట్విట్టర్లో వీడియోలను షేర్ చేశారు.