AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదే.. ఆ “అస్థిపంజరాల’ అసలు కథ !

ఎట్టకేలకు ఆ రహస్యం వీడింది. అలాంటిలాంటి రహస్యం కాదు.. దశాబ్ధాల కాలంగా అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయిన రహస్యానికి తెరపడింది. హిమాలయా పర్వతశ్రేణుల్లోసముద్రమట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున ఉన్నరూప్‌కుండ్‌ సరస్సు కడుపులోని అస్తిపంజరాల తాలూకు ఆధారాలు ఇన్నాళ్లకు బయటపడ్డాయి. హైదరాబాద్ నగరంలోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధన ద్వారా ఈ అస్థిపంజరాలు విభిన్న జాతులకు చెందినవిగా గుర్తించారు. భారతీయలతో పాటు, మధ్యధరా, ఆగ్రేయ ఆసియా ప్రాంతానికి చెందినవారి […]

ఇదే.. ఆ అస్థిపంజరాల' అసలు కథ !
Pardhasaradhi Peri
|

Updated on: Aug 21, 2019 | 2:51 PM

Share

ఎట్టకేలకు ఆ రహస్యం వీడింది. అలాంటిలాంటి రహస్యం కాదు.. దశాబ్ధాల కాలంగా అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయిన రహస్యానికి తెరపడింది. హిమాలయా పర్వతశ్రేణుల్లోసముద్రమట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున ఉన్నరూప్‌కుండ్‌ సరస్సు కడుపులోని అస్తిపంజరాల తాలూకు ఆధారాలు ఇన్నాళ్లకు బయటపడ్డాయి. హైదరాబాద్ నగరంలోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధన ద్వారా ఈ అస్థిపంజరాలు విభిన్న జాతులకు చెందినవిగా గుర్తించారు. భారతీయలతో పాటు, మధ్యధరా, ఆగ్రేయ ఆసియా ప్రాంతానికి చెందినవారి అవశేషాలుగా నిర్ధారించామని పరిశోధనకు నేతృత్వం వహించిన సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు.

నేచర్‌ కమ్యూనికేషన్స్‌ సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమైన సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ మిశ్రా, తంగరాజ్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ అందుబాటులో ఉన్న రుజువులను బట్టి చూస్తే వీరు నందాదేవి దర్శనానికి వెళ్తున్న వారుగానీ, వ్యాపారులు గానీ అయ్యేఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

గత పదేళ్లుగా రూప్‌కుండ్‌లోని అస్థిపంజరాలపై తంగరాజ్‌ పరిశోధనలు చేస్తున్నారు. అక్కడి నమూనాలను సేకరించిన సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్ మిశ్రా..వాటి డీఎన్‌ఏ, మైటోఖాండ్రియాపై పరిశోధించారు. అస్థిపంజరాల సరస్సుగా పేరు పొందిన రూప్‌కుండ్‌లోని చెల్లా చెదురుగా కనిపించే అస్థిపంజరాల్లో స్త్రీ, పురుషులు ఇద్దరివి ఉన్నాయని చెప్పారు. మొత్తం అవి కేవలం ఒక ప్రాంతం, ఒక తెగవి కాదని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలినట్లు ప్రకటించారు. 72 అస్థిపంజరాల డీఎన్‌ఏనీ పరిశీలించిన డాక్టర్‌ తంగరాజ్‌..రూప్‌కుండ్‌లోని మరిన్ని అస్థిపంజారాలపై పరిశోధన జరగాల్సింది ఉందన్నారు.