The River Ganga : గంగానది నీరు పచ్చగా మారింది.. దుర్వాసన వస్తోంది..! ఇది దేనికి సంకేతం..? ఆందోళన చెందుతున్న శాస్త్రవేత్తలు

Ganges is Green : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో గంగా నది నీరు గత కొన్ని రోజులుగా పచ్చగా కనిపించడం ప్రారంభించింది.

The River Ganga : గంగానది నీరు పచ్చగా మారింది.. దుర్వాసన వస్తోంది..! ఇది దేనికి సంకేతం..? ఆందోళన చెందుతున్న శాస్త్రవేత్తలు
Green Ganga

Edited By: Phani CH

Updated on: May 29, 2021 | 10:16 AM

Ganges is Green : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో గంగా నది నీరు గత కొన్ని రోజులుగా పచ్చగా కనిపించడం ప్రారంభించింది. నీటి రంగులో మార్పులు స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్‌లో తక్కువ కాలుష్యం వల్ల గంగానది క్లీన్ చేయబడింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని మాలవియా గంగా పరిశోధనా కేంద్రం అధ్యక్షుడు డాక్టర్ బిడి త్రిపాఠి ప్రకారం.. ” నది ఆకుపచ్చగా మారడానికి మైక్రోసిస్టిస్ ఆల్గే కారణం కావచ్చు ” అని అన్నారు. నడుస్తున్న నీటిలో ఆల్గేను కనుగొనవచ్చని తెలిపారు. కానీ ఇది సాధారణంగా గంగానదిలో కనిపించదు. ఎక్కడ నీరు ఆగిపోతుందో అక్కడ పోషక స్థితి ఏర్పడుతుంది. దీనివల్ల మైక్రోసిస్టమ్స్ పెరుగుతాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది చెరువులు, కాలువల నీటిలో మాత్రమే పెరుగుతుంది.

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. నీరు విషపూరితమైనదా.. ఆకుపచ్చ రంగు చాలా కాలం పాటు ఉందా అని పరిశోధించాలి. గంగానది నీటిలో పోషకాలు పెరగడం వల్ల ఆల్గే కనిపిస్తుందని పర్యావరణ కాలుష్య శాస్త్రవేత్త డాక్టర్ కృపా రామ్ అన్నారు. గంగా నది నీటి రంగును మార్చడానికి ప్రధాన కారణాలలో వర్షం కూడా ఒకటి కావచ్చన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ కృపా రామ్ మాట్లాడుతూ లవణాలు పెరిగినప్పుడు గంగానదిలో ఆకుపచ్చ ఆల్గే ఎక్కువగా కనిపిస్తుంది. వర్షం కారణంగా సారవంతమైన భూమి నుంచి ప్రవహించిన నీరు గంగానదిలో కలుస్తుంది. ఫాస్ఫేట్, సల్ఫర్, నైట్రేట్ కలిపినప్పుడు పోషకాలు ప్రధానంగా ఆకుపచ్చ ఆల్గే మొత్తాన్ని పెంచుతాయి. నీరు స్తబ్దుగా శుభ్రంగా ఉంటే సూర్యుని కిరణాలు నీటి లోపలికి చేరుతాయి. ఆ కారణంగా కిరణజన్య సంయోగక్రియ పెరుగుతుంది.

వారణాసిలోని 84 ఘాట్లలో చాలా వరకు గంగా నీరు పచ్చగా కనిపిస్తుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సహజ ప్రక్రియ అని సాధారణంగా మార్చి, మే మధ్య జరుగుతుందని పేర్కొన్నారు. అయితే నీరు విషంగా మారుతుంది కనుక ఇందులో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయంటున్నారు. అంతేకాదు ఈ నీరు తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని సూచించారు. ఈ సమయంలో గంగానది ఇంత పచ్చగా మారడం ఇదే మొదటిసారి అని స్థానికులు పేర్కొన్నారు. ఒక వృద్ధుడు అజయ్ శంకర్ మాట్లాడుతూ.. దాదాపు మొత్తం నది రంగు మారిపోయిందని, నీరు దుర్వాసన వస్తుందని పేర్కొన్నాడు. శాస్త్రవేత్తలు ఏదైనా సాధారణ నిర్ణయానికి రాకముందే నీటి నమూనాలను పూర్తిగా పరీక్షించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..!

Green India Challeng: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం.. ఎంపీ సంతోష్‌ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..

Corona Spread: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలు.. ఐసీఎంఆర్ నివేదికలో ఆసక్తికర అంశాలు..