తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారగా భారీ పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది హడలెత్తిపోయారు. మస్కట్ నుంచి 146 మంది ప్రయాణికులతో విమానం చెన్నై చేరుకుంది. ల్యాండింగ్ అయ్యే సమయంలో హఠాత్తుగా టైర్ పేలింది.
ఈ ప్రమాద ఘటనలో ఎవరికి, ఎటువంటి అపాయం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. విమానం రిటర్న్ జర్నీ రద్దు అయ్యిందని, ప్రయాణికులకు ఆయా హోటళ్లలో బస కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..