Maharashtra: మంత్రికి చికిత్స చేస్తుండగా పవర్‌ కట్‌.. సెల్‌ఫోన్‌ వెలుగులో ట్రీట్‌మెంట్‌.. చివరికి ఊహించని ట్విస్ట్..

|

Oct 18, 2022 | 1:29 PM

తమ సమస్యల గురించి ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోరు. అదే సమస్య వారికి ఎదురైనప్పుడు మాత్రం అల్లాడిపోతారు. అందుకే ఏదైనా తనదాకా వస్తేకానీ అర్థం కాదని అంటూంటారు...

Maharashtra: మంత్రికి చికిత్స చేస్తుండగా పవర్‌ కట్‌.. సెల్‌ఫోన్‌ వెలుగులో ట్రీట్‌మెంట్‌.. చివరికి ఊహించని ట్విస్ట్..
Doctor Treatment
Follow us on

తమ సమస్యల గురించి ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోరు. అదే సమస్య వారికి ఎదురైనప్పుడు మాత్రం అల్లాడిపోతారు. అందుకే ఏదైనా తనదాకా వస్తేకానీ అర్థం కాదని అంటూంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. ఓ ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వెళ్లిన మంత్రి అక్కడ వైద్యులతో దంతాలకు చికిత్స చేయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ కరెంట్‌ పోవడంతో సెల్‌ఫోన్‌ వెలుగులో మంత్రిగారికి వైద్యం చేశారు డాక్టర్లు. ఔరంగాబాద్‌లోని ఘటి ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు కేబినెట్‌ మంత్రి సందీపన్‌ భుమ్రే వెళ్లారు. అక్కడి వైద్యులతో ఆయన దంత పరీక్షలు చేయించుకున్నారు.

రూట్‌కెనాల్‌ చికిత్స చేయించుకోవాల్సిందిగా సందీపన్‌కు వైద్యులు సూచించడంతో వెంటనే చేయమని మంత్రి కోరారు. దాంతో వైద్యులు కూడా చికిత్స మొదలుపెట్టారు..కాగా మంత్రికి వైద్యం చేస్తున్న సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చేసేది లేక డాక్టర్లు తమ సెల్‌ఫోన్స్‌లో లైట్స్‌ ఆన్‌చేసి ట్రీట్‌మెంట్‌ పూర్తి చేశారు. జనరేటర్‌ కావాలని చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు వైద్యులు మంత్రికి తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి సందీపన్‌ నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి