Video Viral: ఇదే కదా కావాల్సింది.. పావురాల కోసం వాటర్ షవర్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

|

Apr 11, 2022 | 1:13 PM

రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మనుషులకే ఇలా ఉంటే మరి.. పశుపక్ష్యాదుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలం. దాహం...

Video Viral: ఇదే కదా కావాల్సింది.. పావురాల కోసం వాటర్ షవర్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
Water Shower
Follow us on

రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మనుషులకే ఇలా ఉంటే మరి.. పశుపక్ష్యాదుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలం. దాహం తీర్చుకునేందుకూ వాటికి నీరు దొరకక సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక సీనియర్ సిటిజన్.. ఎండకు అల్లాడిపోతున్న పావురాల గుంపుపై నీరు చల్లారు. పక్షులు షవర్‌ను ఆస్వాదిస్తూ, రెక్కలు విప్పుతూ, ఆనందంతో కిలకిలరావాలు చేస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారందరూ అతనిని అభినందిస్తున్నారు. ఈ దృశ్యాలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా షేర్ చేశారు. 27 సెకన్ల ఈ క్లిప్‌కు ఇప్పటివరకు 3.9 లక్షల మంది వీక్షించారు. “సానుభూతి గల భారతదేశంలో ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.86 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన తోటివారి పట్ల సానుభూతి చూపుదాం” అని అని నందా క్యాప్షన్ ఇచ్చారు.

Also Read

Gujarat Blast: గుజరాత్ లో భారీ పేలుడు.. రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం

Hyderabad: మాదాపూర్ వడ్డెర బస్తీలో మరో మరణం నమోదు.. చికిత్స పొందుతూ 80ఏళ్ల వృద్ధురాలు మృతి

ఇది కదా ప్రతీకారమంటే.. గత సీజన్‌లో బెంచ్‌కే పరిమితం.. కట్ చేస్తే.. అదే టీంకు దిమ్మతిరిగే షాకిచ్చిన బౌలర్..