విమానయాన రంగంలో డ్రీమ్‌ లైనర్ ఓ ట్రెండ్ సెట్టర్‌.. ప్రమాదంపై ఎన్నో అనుమానాలు?

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన విమానం. ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలతో డిజైన్ చేసిన అత్యాధునిక బోయింగ్. దీని బాడీ తేలికైన పదార్థాలతో, అంటే ఎక్కువగా కార్బన్ ఫైబర్‌తో నిర్మితమైంది. బరువు తక్కువగా ఉండడంతో ఇంధనం 25శాతం ఆదా అవుతుంది. బోయింగ్ విమానంలో గరిష్టంగా 230మంది ప్రయాణించగలరు.

విమానయాన రంగంలో డ్రీమ్‌ లైనర్ ఓ ట్రెండ్ సెట్టర్‌.. ప్రమాదంపై ఎన్నో అనుమానాలు?
Air India 3

Edited By: TV9 Telugu

Updated on: Jun 13, 2025 | 1:17 PM

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన విమానం. ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలతో డిజైన్ చేసిన అత్యాధునిక బోయింగ్. దీని బాడీ తేలికైన పదార్థాలతో, అంటే ఎక్కువగా కార్బన్ ఫైబర్‌తో నిర్మితమైంది. బరువు తక్కువగా ఉండడంతో ఇంధనం 25శాతం ఆదా అవుతుంది. బోయింగ్ విమానంలో గరిష్టంగా 230మంది ప్రయాణించగలరు. 14వేల కిలోమీటర్ల దూరం వరకు ఆగకుండా ఎగరగల సామర్ధ్యం డ్రీమ్‌లైనర్‌కు ఉంది.

బోయింగ్‌ 787లో ఉన్న మరో ప్రత్యేకత రోల్స్ రాయిస్ ఇంజన్లు. ఇవి తక్కువ శబ్దం, ఎక్కువ ఇంధనం ఆదా చేస్తాయి. అలాగే తక్కువ కాలుష్యంతో ప్రయాణిస్తాయి. శబ్దం 15% తక్కువగా ఉండటంతో విమానాశ్రయాల సమీపంలోని ప్రజలకు, అలాగే పర్యావరణ పరంగా ఇవి అత్యంత సురక్షితం. డ్రీమ్‌లైనర్ ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థతో నడుస్తుంది. ఇది సాధారణ హైడ్రాలిక్ సిస్టమ్‌కు బదులు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌తో విమానాన్ని నడిపిస్తుంది. అందుకే నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ. డ్రీమ్‌లైనర్‌కు ప్రధాన ఆకర్షణ క్యాబిన్ డిజైన్. దీని కిటికీలు సాధారణ విమానాల కిటికీల కంటే 65% పెద్దవి, ఎక్కువ సహజ కాంతిని ఇస్తుంటాయి. క్యాబిన్ ప్రెజర్‌ కూడా సాధారణ విమానాల కంటే చాలా తక్కువ. అందుకే గంటలతరబడి ప్రయాణించినా…ప్రయాణికులకు అలసట ఉండదు. ఎక్కువ తేమ, ఎప్పటికప్పుడు ఎయిర్ క్లీన్ వ్యవస్థ ఉండడంతో..ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.

బోయింగ్ 787-8 రెక్కలు వంగి ఉండడంతో.. గాలిని నియంత్రణలో ఉంచుచుంది. దీనివల్ల ఇంధనం ఎక్కువ ఆదా అవుతుంది. 32.2 మీటర్ల వెడల్పుతో ఉన్న దీని రెక్కలు విమానాన్ని స్థిరంగా ఉంచుతూ.. ఎత్తును పెంచుతాయి. విమానం గంటకు 650 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాక్‌పిట్‌లో ఆధునిక డిస్‌ప్లేలు, టచ్‌స్క్రీన్‌లు పైలట్లకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు సులభంగా చేరవేస్తుంటాయి. ఎమర్జెన్సీ సమయంలో నిర్ణయాలను తీసుకోవడంలో వేగవంతంగా సహాయం చేస్తాయి.

ఇందులో స్పెషాలిటీ LED లైట్లు. ఇవి సమయానికి తగ్గట్టుగా రంగులను ఛేంజ్ చేస్తుంటాయి. అలాగే లగేజ్ ఉంచే క్యాబిన్‌లు కూడా విశాలంగా ఉంటాయి. సౌకర్యవంతమైన సీట్లు దీని ప్రత్యేకత. బిజినెస్ క్లాస్‌లోనే కాదు.. ఎకానమీ క్లాస్‌లో కూడా సీటుకు సీటుకు మద్య స్పేస్ ఉండడంతో.. కాళ్లు చాపుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆధునిక టచ్‌స్క్రీన్‌లతో కూడిన వ్యవస్థ ఉండడంతో.. సినిమాలతో పాటు గేమింగ్ సదుపాయం కూడా ఉంటుంది.

డ్రీమ్‌లైనర్ పర్యావవరణ హితంగా రూపొందించడం జరిగింది. ఇంధన ఆదా, తక్కువ కాలుష్యంతో పర్యావరణానికి హానిని తగ్గిస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చులతో విమాన సంస్థలకు అధిక లాభాన్ని డ్రీమ్‌లైనర్ బోయింగ్‌ విమానాలు అందిస్తాయి. అందుకే డ్రీమ్‌లైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా విమాన సంస్థలకు ఇష్టమైనవి మారాయి. విమానయాన రంగంలో డ్రీమ్‌ లైనర్ ఓ ట్రెండ్ సెట్టర్‌ గా నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..