Tamil Nadu: పాత ఫ్రంట్లు.. కొత్త టెంట్లు – ఆసక్తికరంగా తమిళ పాలిటిక్స్

స్టేట్‌ పాలిటిక్స్‌ విషయంలో తమిళనాడు వేరే లెవెల్‌లో ఉంటుంది. అక్కడ ప్రతీ 5 ఏళ్లకు ప్రభుత్వం మారినా.. రెండు పార్టీల మధ్యే చేతులుమారుతూ ఉంటుంది. ఉంటే డీఎంకే, లేకపోతే అన్నాడీఎంకే. జయలలిత ఉన్నన్ని రోజులు అన్నాడీఎంకే ఓ వెలుగు వెలిగింది. ఆమె చనిపోయిన తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయి. అయితే ఈసారి ఎన్నికల్లో మళ్లీ డీఎంకే అధికారం నిలుపుకుంటుందా.? పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే జీవం పోసుకుంటుందా? ఇదే ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌. వీళ్లిద్దరి మధ్యలో విజయ్‌ టీవీకే రూపంలో కొత్త కుంపటి పెడ్డంతో.. పక్కరాష్ట్రంలో రాజకీయాలు భగ్గున మండుతున్నాయి. ఆయన సింగిల్‌గా వెళ్తారో.. పొత్తులో పోతారో తెలియక తలలు పట్టుకుంటున్నాయి పార్టీలు.

Tamil Nadu: పాత ఫ్రంట్లు.. కొత్త టెంట్లు - ఆసక్తికరంగా తమిళ పాలిటిక్స్
Tamil Nadu Politics

Updated on: Jul 21, 2025 | 9:39 PM

దళపతి విజయ్ పార్టీ TVK తమిళనాడులో సంచలనంగా మారింది. ఆయన నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటి అని అన్ని తమిళ, జాతీయ పార్టీలు కీన్‌గా అబ్జర్వ్‌ చేస్తున్నాయి. ఆయన పొత్తు పెట్టుకుంటారా? ఒంటరిగా వెళ్తారా అనేది మిస్టరీగానే ఉంది. ఇప్పటి వరకు ఆయన అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. పొత్తుకు సానుకూలంగానే ఉన్నారు. అయితే ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటారనేదే ఇంపార్టెంట్‌ క్వశ్చన్‌. విజయ్‌ బలం చాలా ఉంది. అయితే ఆయన బలగం అంతంతమాత్రమే. ఆయన పార్టీలో ఔత్సాహిక అభ్యర్థులు ఉన్నా.. వారికి అంత పాపులారిటీ గాని, సీనియారిటీ గాని లేదు. దీంతో సీనియర్‌ పార్టీతో కలిసివెళ్తే.. అన్నిరకాలుగా కలిసొస్తుందన్న థాట్‌లో ఉన్నారు విజయ్‌. అధికారంలో ఉన్న డీఎంకే ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది. విజయ్‌ కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం లేదు కాని.. డీఎంకేపై విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రెండోవైపు చూద్దాం. అన్నాడీఎంకే తన పొజిషన్‌ను ఇంకా మెరుగుపర్చుకుంది. పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ గతం కన్నా బలంగా ఉంది. జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాలతో పార్టీ చీలిపోతుందని అంతా భావించారు కాని.. అన్నాడీఎంకే కేడర్‌ మాత్రం తమ పార్టీతో బలంగా నిలబడింది. దీనంతటికి కారణం పళనిస్వామి. పటిష్ట నాయకత్వంతో ఆయన పార్టీని మంచి పొజిషన్లో ఉంచారు. ఈ నేపథ్యంలో.. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు అంటే మంచి కాంబినేషన్‌ అనే ఆలోచనతో ఉన్నాయి కొన్ని పార్టీలు. బీజేపీతో...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి