జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాల్పులు.. కౌన్సిలర్‌తో సహా ఇద్దరు మ‌ృతి

| Edited By: Sanjay Kasula

Mar 29, 2021 | 3:57 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లో ప్రజా ప్రతినిధులను టార్గెట్‌ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు.

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాల్పులు.. కౌన్సిలర్‌తో సహా ఇద్దరు మ‌ృతి
Terrorists Attack Councillors
Follow us on

Terrorists attack : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లో ప్రజా ప్రతినిధులను టార్గెట్‌ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (బిడిసి) సమావేశంలోకి చొరబడ్డ టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మున్సిపల్‌ కౌన్సిలర్‌ రియాజ్‌ , గన్‌మెన్‌ అహ్మద్‌ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మరికొందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా గాయపడ్డారు.

ఉగ్రవాదుల దాడిలో మరో కౌన్సిలర్‌ షంషుద్దీన్‌ పీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సోపోర్‌ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్‌ చేపట్టాయి కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బ్లాక్‌ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఫరీదాఖాన్‌ను టార్గెట్‌ చేస్తూ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. కాల్పుల్లో ఫరీదాఖాన్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొనట్టు తెలుస్తోంది. దుండగులను గుర్తించడానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లడపడుతున్నారు.

Read Also.. Homemade Summer Drink: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే సొంపు డ్రింక్ తయారీ .. ఈ డ్రింక్ తో ప్రయోజనాలు తెలిస్తే వదలరుగా..!