Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా.. జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ కుల్గాం జిల్లాలోని చెయాన్ దేవ్‌సర్ ప్రాంతంలో ఆదివారం ఆదివారం జరిగింది. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదుల ఉనికి సమాచారంతో చెయాన్ దేవ్‌సర్ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బలగాలు సైతం దాడులను తిప్పికొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని.. వారిలో ఒకరు పాకిస్థాన్ ఉగ్రవాది హైదర్‌గా గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ తెలిపారు.
హైదర్ రెండేళ్లుగా ఉత్తర కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడని, అనేక ఉగ్రవాద నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ఒకరు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థకు చెందినవాడని విజయ్ కుమార్ తెలిపారు.
#KulgamEncounterUpdate: Both the trapped #terrorists killed. #Incriminating materials including arms & ammunition recovered.
Search going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/YRsKZLTHm3— Kashmir Zone Police (@KashmirPolice) May 8, 2022
Also Read :