NEET PG 2022 Exam date: నీట్‌ పీజీ వాయిదా పడిందంటూ నెట్టింట ఫేక్‌ న్యూస్! క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల కోసం నిర్వహించాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG 2022) వాయిదా వేశారంటూ ఓ నకిలీ సర్క్యులర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది..

NEET PG 2022 Exam date: నీట్‌ పీజీ వాయిదా పడిందంటూ నెట్టింట ఫేక్‌ న్యూస్! క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
Neet Pg 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 08, 2022 | 6:37 PM

NEET PG 2022 postponed, says fake document circulating: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల కోసం నిర్వహించాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG 2022) వాయిదా వేశారంటూ ఓ నకిలీ సర్క్యులర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నీట్ పీజీ 2022 పరీక్ష మే 21న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఐతే ఈ పరీక్షను జులై 9వ తేదీకి వాయిదా వేశారంటూ నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (NBE) పేరుతో ఓ నకిలీ సర్క్యులర్‌ బయటికొచ్చింది. ఇది వైరల్‌ అవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. అవన్నీ నకిలీ వార్తలని, అటువంటి ఉత్తర్వులేవీ విడుదల చేయలేదని, నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది.

నిజానికి ఈ పరీక్ష ఈ ఏడాది మార్చి 12వ తేదీనే జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల దృష్ట్యా మే 21వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేయాలంటూ గత కొన్నిరోజులుగా విద్యార్థుల నుంచి అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. దీనిపై కొందరు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు.

ఈ నేపథ్యంలో పరీక్ష వాయిదాకు సంబంధించి ఓ సర్క్యులర్‌ తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. ఏప్రిల్‌ 28వ తేదీన నేషన్‌ బోర్డ్ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పేరుతో ఉన్న ఆ సర్క్యులర్‌లో పరీక్షను జులై 9వ తేదీకి వాయిదా వేసినట్లుగా ఉంది. ఇది కాస్తా అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ దీనిపై ఫ్యాక్ట్‌చెక్‌ చేసింది. ఆ సర్క్యులర్‌ నకిలీదని, దాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్‌లో వెల్లడించింది. నీట్ పీజీ పరీక్షలో మార్పేమీ లేదని, మే 21వ తేదీనే జరుగుతుందని పేర్కొంది.

Also Read:

BIS Recruitment 2022: ఈ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు (348) దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..