Viral: డబ్బు అవసరమై బ్యాంక్‌కు వెళ్లిన మహిళ.. లాకర్ ఓపెన్ చేసి చూడగా..!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కష్టపడి కూడబెట్టుకుని లాకర్‌లో దాచిపెట్టుకున్న సొమ్ముకు..

Viral: డబ్బు అవసరమై బ్యాంక్‌కు వెళ్లిన మహిళ.. లాకర్ ఓపెన్ చేసి చూడగా..!
Bank Locker

Updated on: Feb 13, 2023 | 4:26 PM

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కష్టపడి కూడబెట్టుకుని లాకర్‌లో దాచిపెట్టుకున్న సొమ్ముకు చెదలు పట్టడంతో.. సదరు కస్టమర్ లబోదిబోమన్నారు. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలంటూ బ్యాంకు సిబ్బందిపై మండిపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. కాలాజీ గోరాజీలోని పీఎన్‌బీ బ్రాంచ్‌లో సునీత మెహతా అనే మహిళ సుమారు 2 లక్షల వరకూ నగదు దాచుకుంది. ఇటీవల డబ్బు అవసరమై ఓ రోజు ఆమె లాకర్‌లోని డబ్బును ఇంటికి తెచ్చుకున్నారు. ఈక్రమంలో డబ్బు తెచ్చిన బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. అందులో కొన్ని కరెన్సీ నోట్లు పొడిపొడిగా అయిపోయి కనిపించాయి. చెదలు పట్టడంతో నోట్లు నాశనమయ్యాయని గుర్తించి ఆమె బిత్తరపోయింది. దాదాపు 15 వేల రూపాయల వరకు కరెన్సీ నోట్లన్నీ పూర్తిగా చెదలు తినేసాయి. మరికొన్ని నోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే ఆ నగదు తీసుకొని బ్యాంకుకు వెళ్లిన ఆమె సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం తన డబ్బు వాపస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజ‌రుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో బాధితురాలు నష్టపోయిన మొత్తాన్ని బ్యాంకు అప్పటికప్పుడు తిరిగిచ్చేసింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బ్యాంకు అధికారులు కూడా ఈ పరిణామంతో షాకైపోయారట. లాకర్‌లో దాచిన కరెన్సీ నోట్లలో చాలా వరకు చెదలుపట్టి నిరుపయోగంగా మారినట్టు గుర్తించి నివ్వెరపోయారు. స్థానికంగా ఈ వార్త కలకలం రేపడంతో కస్టమర్లు బ్యాంకుకు పోటెత్తారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెదల నివారణ కోసం బ్యాంకు పటిష్ఠ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us