ప్రపంచ గొప్పనగరాల సరసన భాగ్యనగరం

|

Sep 04, 2020 | 6:17 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంను అభివృద్ధి చేయటం వల్ల ఇవాళ ఐటీ, ఫార్మా ఎగుమతులకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్య కేంద్రమైందని తెలంగాణ ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ప్రపంచ గొప్పనగరాల సరసన భాగ్యనగరం
Follow us on

ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంను అభివృద్ధి చేయటం వల్ల ఇవాళ ఐటీ, ఫార్మా ఎగుమతులకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్య కేంద్రమైందని తెలంగాణ ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నగరం కు ఉన్న బ్రాండింగ్ ను దృష్టిలో పెట్టుకొని MICE(Meetings, Incentives, Conferences,Exhibitions)టూరిజం అభివృద్ధి కి చర్యలను చేపట్టుతున్నామని చెప్పారు. MICE టూరిజం ప్రపంచంలో గొప్ప నగరాలైన లండన్, ప్యారిస్, న్యూయార్క్, సిడ్నీ, బీజింగ్, టోక్యో, దుబాయ్ లాంటి నగరాల సరసన హైదరాబాద్ నగరాన్ని నిలబెడతామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పర్యాటకరంగ అభివృద్ధి పై మంత్రి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హైదరాబాద్ కన్వెన్షన్ విజిటర్స్ బ్యూరో(HCVB) నిర్వహించే MICE టూరిజం పై ప్రదానంగా చర్చించారు. కోవిడ్ – 19 కు ముందు హైదరాబాద్ సిటీకి ఉన్న బ్రాండింగ్ వల్ల గ్లోబల్ కాన్ఫెరెన్సు లకు వేదికగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అంతర్జాతీయ స్థాయి మీటింగ్ లను, కాన్ఫెరెన్సు లను, ఎగ్జిబిషన్ లను నిర్వహించామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అనుసరిస్తున్న నూతన విధానాల వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు.