Revanth Reddy: ప్రధాని మోడీ – సీఎం కేసీఆర్ మధ్య ఫెవికాల్ బంధం.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

|

Sep 08, 2021 | 6:30 PM

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలు వేరైనా ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఉందన్నారు.

Revanth Reddy: ప్రధాని మోడీ - సీఎం కేసీఆర్ మధ్య ఫెవికాల్ బంధం.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Pcc Meet Rahul Gandhi
Follow us on

Telangana PCC meet Rahul Gandhi: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలు వేరైనా ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఎంఐఎం ఎన్ని స్థానాలలో పోటీచేయించాలనే విషయంపై కేసీఆర్, మోడీల మధ్య చర్చ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, మోడీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ బలి పశువులు అవుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ బృందం భేటీ అయ్యింది. బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ‌లో ప్రస్తుత రాజకీయ ప‌రిస్థితులు, కేసీఆర్ పాల‌న‌, బీజేపీ పాద‌యాత్ర అన్ని అంశాలపై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత నూతన ఆఫీస్ బేరర్లతో రాహుల్ గాంధీ ఇవాళ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ స‌మావేశంలో సీఎల్పీ నేత భ‌ట్టివిక్రమార్క, పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు, కొత్తగా ఎన్నికైన వివిద క‌మిటీల చైర్మన్లు కూడా పాల్గొన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయమై రాహుల్ గాంధీ పార్టీ నేతలతో చర్చించినట్లు రేవంత్ రెడ్డి భేటీ అనంతరం తెలిపారు. ఈ సంధర్బంగా సెప్టెంబ‌ర్ 17న సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గ‌జ్వేల్‌లో తలపెట్టిన ద‌ళిత, గిరిజ‌న దండోరా బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా రాహుల్‌ను కోరినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే, ప్రతి మూడు నెలలకోసారి తెలంగాణలో పర్యటించాలని రాహుల్ గాంధీని కోరామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సోనియా గాంధీ కొత్త రాష్ట్రాన్ని ఇచ్చారన్న రేవంత్ రెడ్డి.. టీఎఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో రాష్ట్రం ఎందరో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్న రేవంత్.. డిసెంబరు 9 నుండి రాష్ట్రంలో పార్టీ నిర్మాణంకోసం సభ్యత్వ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. రాహుల్ గాంధీ సూచనలు, సలహాల మేరకు రాష్ట్రంలో పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నాము. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ, త్యాగాల ప్రతీక.. అమరవీరుల స్థూపం కానీ పార్టీ ఆఫీసులు కాదన్న రేవంత్‌రెడ్డి.. ఢిల్లీలో అమరవీరుల స్థూపానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరం స్థలం కేటాయించాలనిడిమాంద్ చేశారు.

Read Also… 

Viral Video: కొండచరియలు పడుతుండగా తృటిలో తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముగిసిన రానా విచారణ.. కెల్విన్‌తో కలిపి 7 గంటల పాటు..