కంగనాకు మద్దతుగా హైదరాబాద్ లో ధర్నా

|

Sep 13, 2020 | 6:01 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మద్దతుగా హైదరాబాద్ లో రాస్తారోఖో నిర్వహించారు శ్రీ రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణి సేన తెలంగాణ శాఖ కార్యకర్తలు. హైదరాబాద్ బేగంబజార్ లో ఆ సంఘం నాయకులు కంగనా కు మద్దతుగా..

కంగనాకు మద్దతుగా హైదరాబాద్ లో ధర్నా
Follow us on

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మద్దతుగా హైదరాబాద్ లో రాస్తారోఖో నిర్వహించారు శ్రీ రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణి సేన తెలంగాణ శాఖ కార్యకర్తలు. హైదరాబాద్ బేగంబజార్ లో ఆ సంఘం నాయకులు కంగనా కు మద్దతుగా ఆందోళన చేపట్టారు. కంగనా పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డ నేతలు.. ఆమె పై వివాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రావత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలకు మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం.. కంగనా పై కక్షపూరితంగా వ్యవరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన ప్రభుత్వం వెంటనే కంగనాకు క్షమాపణ చెప్పి.. కూల్చివేసిన ఆమె కార్యాలయాన్ని తిరిగి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కర్ణి సేన దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని కర్ణిసేన తెలంగాణ శాఖ నేతలు ఠాకూర్ సతీష్ సింగ్, రాజు సింగ్ హెచ్చరించారు. ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ వివాస్పద మృతి పై నటి కంగనా రనౌత్ స్పందిస్తున్న తీరు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ సవాల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కంగనా కు వెన్నుదన్నుగా శ్రీ రాష్ట్రీయ రాజపుత్ కర్ణి సేన దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.