తమిళనాడు(Tamil Nadu)లోని పాఠశాలలో మతమార్పిడి కల్లోలం రేపింది. కన్యాకుమారిలోని ఓ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో మత మార్పిడి(religious conversion)కి ప్రయత్నించారని ఆరోపిస్తూ.. ఆరో తరగతి విద్యార్థిని ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమై ఉపాధ్యాయురాలిని సస్పెండ్(Suspend) చేశారు. కన్నతువిలై ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఘటనపై తోటి విద్యార్థులను అడిగి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయురాలు తమకు బైబిల్ చదవమని చెప్పేవారని, భోజన విరామం తర్వాత తనతో కలిసి ప్రార్థనలో పాల్గొనాలని అడిగేవారని ఒక విద్యార్థి చెప్పాడు. దీంతో తాము హిందువులమని, బైబిల్ బదులు భగవత్ గీత చదువుతామని ఆ టీచర్ కు చెప్పామన్నారు. దీంతో ఆమె హిందువులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిందని విద్యార్థిని ఆరోపించింది. పలు క్లాసుల నుంచి విద్యార్థులను పిలిపించి మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రార్థనలు చేసేదని వివరించింది.
విద్యార్థి ఫిర్యాదుతో కన్యాకుమారి డీఈవో ఎమ్పెరుమాళ్ పాఠశాలను సందర్శించారు. తరగతి గదిలో మతం గురించి మాట్లాడుతోందన్న విద్యార్థుల ఆరోపణతో ఉపాధ్యాయిరరాలిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఏఐఏడీఎంకే నేత కోవై సత్యన్ స్పందిస్తూ.. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటీవలి కాలంలో ఇలాంటి ఆరోపణలు చాలా వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఎమ్‌కే స్టాలిన్ ప్రభుత్వం అభియోగాల వాస్తవికతను విచారించాలన్నారు. ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read
వామ్మో.. అదేంటి గురూ అలా తిప్పేశావ్ !! మైండ్ బ్లాంక్ వీడియో
Heat Rashes: ఎండాకాలం హీట్ ర్యాషెస్ సమస్య వేధిస్తుందా.. ఇంట్లోనే వీటిని ట్రై చేయండి..!
Mahavir Jayanti 2022: నేడు భగవాన్ మహావీర్ జయంతి.. ఆయన చెప్పిన సూత్రాలు అందరికి ఆదర్శప్రాయం..!