Tamilnadu: తమిళనాడు పోలీసులకు వీక్లీ ఆఫ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

అధికారంలోకి వచ్చినప్పటి ఉంచి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌..

Tamilnadu: తమిళనాడు పోలీసులకు వీక్లీ ఆఫ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
Follow us

|

Updated on: Nov 04, 2021 | 11:08 AM

అధికారంలోకి వచ్చినప్పటి ఉంచి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌. పాలనలో ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు పలు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలును చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పని ఒత్తిడితో చాలామంది పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక సెలవులు దొరక్కపోవడంతో పండగలు, ఇంట్లోని ఫంక్షన్లకు కూడా హాజరవ్వలేక మానసిక ఆందోళనకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ ‘వీక్లీ ఆఫ్‌’ ఉత్తర్వులతో లక్షలాది మంది పోలీసులకు మేలు చేకూరుతుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కంట్రోల్‌ రూంకు ఐఎస్‌వో గుర్తింపు.. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఫస్ట్‌, సెకండ్‌ గ్రేడ్‌ పోలీసులు, హెడ్ కానిస్టేబుళ్లకు వారంలో ఒకరోజు వీక్లీ ఆఫ్‌ తీసుకునే అవకాశం కల్పించారు. స్టేషన్లలోని ఇతర సిబ్బంది షిఫ్ట్‌ పద్ధతుల్లో వీక్లీ ఆఫ్‌ తీసుకోవచ్చు. ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించడం కోసం చెన్నై డీజీపీ కార్యాలయంలో ఓ ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చిన ఫిర్యాదులను ఆయా జిల్లాల పోలీసులకు పంపించి వీలైనంత వేగంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అలా ఈ కంట్రోల్ రూం ద్వారా ఈ ఏడాది 1.12 కోట్ల ఫిర్యాదులకు పరిష్కారం చూపారు. ఈ క్రమంలో బ్రిటిష్‌ స్టాండర్డ్‌ ఇనిస్టిట్యూట్‌ కంట్రోల్‌ రూంకు ఐఎస్‌ఓ గుర్తింపును అందజేసింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను సీఎం స్టాలిన్‌ చేతుల డీజీపీ శైలేంద్రబాబుకు అందజేశారు.

Also Read:

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం.. ఇవాళ గాలి నాణ్యత ఎంత నమోదైందంటే..?

National News: 2030 నాటికి నీట మునగనున్న ఆ మహానగరం .. ఓ అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

Lock Down Again: దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌..? ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మొదలు.! మరోసారి పంజా విసురుతున్న కరోనా.. (వీడియో)