MK Stalin: సీఎం.. అయినా సాధారణ వ్యక్తిలా.. కాన్వాయ్ ఆపి వృద్ధురాలి పిటిషన్ స్వీకరించిన స్టాలిన్..

Tamilnadu CM MK Stalin: తమిళనాడులో అధికారం చేపట్టిన నాటినుంచి డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనమార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. కోవిడ్ నియంత్రణకు

MK Stalin: సీఎం.. అయినా సాధారణ వ్యక్తిలా.. కాన్వాయ్ ఆపి వృద్ధురాలి పిటిషన్ స్వీకరించిన స్టాలిన్..
Tamilnadu Cm Mk Stalin

Updated on: Jun 15, 2021 | 9:48 AM

Tamilnadu CM MK Stalin: తమిళనాడులో అధికారం చేపట్టిన నాటినుంచి డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనమార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. కోవిడ్ నియంత్రణకు వేసిన కమిటీలో ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. తాజాగా ఆయన మరో సంఘటనతో వార్తల్లో నిలిచారు. తాను ముఖ్యమంత్రి అయితేనేం.. ఒక సాధారణ వ్యక్తినేనంటూ నిరూపించారు. హంగుఆర్భాటాలకు దూరంగా ఉండే స్టాలిన్.. తాజాగా తన కాన్వాయ్‌ను ఆపి మరీ.. ఓ మహిళ దగ్గర ఫిర్యాదును స్వీకరించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులోని పలు జిల్లాల్లో సోమవారం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తిరుచీకి వెళ్ళే మార్గంలో.. ఒక మహిళ.. దరఖాస్తుతో రోడ్డు వెంట నిల్చొని ఎదురు చూస్తోంది.

ఈ క్రమంలో కాన్వాయ్ ముందుకు వెళుతోంది. అర్జీతో ఉన్న మహిళను చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్ కాన్వాయ్ ని ఆపి పిటిషన్‌ను అందుకున్నారు. వెంటనే దానిపై సంతకం చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రే.. అర్జీ తీసుకోవడంతో ఆ వృద్ధురాలు అనందంతో వెనుదిరిగింది. ఇదంతా సెకన్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఈ సంఘటనను చూసిన నెటిజన్లంతా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను అభినందిస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న ఆయన సాధారణ వ్యక్తిలా అర్జీ తీసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.


Also Read:

MLA Ramila Khadiya: నా అనుచరుడినే ఆపుతావా..? కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న మహిళా ఎమ్మెల్యే.. కేసు నమోదు

Petrol Diesel Price Today: ఢిల్లీలో అక్కడే ఉంది..! హైదరాబాద్‌లో మాత్రం రూ.100 మార్క్ దాటిన పెట్రోల్ ధర..! మీ నగరంలో ఎలా ఉందో..!