Viral News: దొంగతనానికి వచ్చి ఇంటి ఓనర్‌కు లేఖ రాసి వెళ్లిన దొంగ.. లెటర్ చదివి నోరెళ్లబెట్టిన యజమాని!

తమిళనాడులో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లన దొంగకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇంట్లో ఎత్తుకెళ్లేందుకు అతనికి డబ్బు, బంగారం వంటి ఎలాంటి విలువైన వస్తువులు లభించలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆ దొంగ.. ఆ ఇంటి యజమానికి ఒక లేఖ రాసి ఇంట్లో ఉంచి వెళ్లాడు. మరుసటి రోజు ఇంటికొచ్చిన యజమాని ఈ లెటర్ చూసి షాక్ అయ్యాడు. ఇంతకు ఆదొంగ ఆ లెటర్‌లో ఏం రాశాడో తెలుసుకుందాం పదండి.

Viral News: దొంగతనానికి వచ్చి ఇంటి ఓనర్‌కు లేఖ రాసి వెళ్లిన దొంగ.. లెటర్ చదివి నోరెళ్లబెట్టిన యజమాని!
Tamil Nadu Incident

Updated on: Nov 26, 2025 | 12:07 PM

అతనొక దొంగ.. చాలా రోజులగా ఎక్కడా అతనికి అనుకున్న మేర సొమ్ము దొరకట్లేదు.. అలాంటి వ్యక్తి ఇటీవలే ఒక ఇల్లు కనిపించింది. అది కూడా ఆ ఇంట్లో ఉండేవారు ఊరెళ్లారు. ఇల్లుకు తాళం వేసింది.. ఇళ్లను గుల్ల చేసేందుకు ఇదే సరైన సమయం అనుకున్నాడు. ఈ ఇంట్లో తనకు ఆశించిన మేర సొమ్ము దొరుకుతుందని ఇంట్లోకి చొరబడ్డాడు. తీరా ఇంట్లో డబ్బు, నగలు, ఇతర ఏ విలువైన వస్తువులు లేక పోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. ఇక చేసేదిమి లేక ఇంటి యజమానికి ఒక లేఖను రాసి అక్కడే పెట్టి వెళ్లాడు. ఈ ఆశ్చర్యకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలోని ఓల్డ్ పెట్టై ప్రాంతంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లాలోని ఓల్డ్ పెట్టై ప్రాంతంలోని ఒక ఇంట్లో జేమ్స్ పాల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే తన కూతురిని చూడటానికి తన కుటుంబంతో కలిసి ఇటీవలే తను మధురై వెళ్ళాడు.ఈ క్రమంలో ఇంటికి తాళం ఉండడాన్ని గమనించిన ఒక దొంగ ఇంట్లోకి చొరబడి నగలు, డబ్బుతో సహా ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో ఉన్న బీరువాలను, కబోడ్‌లలో అన్నింటి వెతికాడు కానీ ఇంట్లో అతనికి నగలు, డబ్బు వంటి ఎలాంటి విలువైన వస్తువులు దొరకలేదు.. ఇళ్లు మొత్తం వెతికితే కనీసం రూ.10 కూడా కనబడలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆ దొంగ ఇంటి యజమానికి నాలుగు పేజీల లేఖ రాసి వెళ్లిపోయాడు.

ఉదయం ఇంటికి వచ్చిన యజమాని ఇంట్లో ఉన్న ఆ లేఖను చూశాడు.. దాన్ని ఒపెన్‌ చేయగా.. నమస్తే సార్.. నేను ఒక దొంగను.. మీరు ఇంట్లో కనీసం ఒక్క రూపాయి కూడా పెట్టలేదు.. నాలాంటి దొంగలు మళ్లీ వచ్చినప్పుడు మోసపోకుండా ఉండేందుకు కనీసం ఇంట్లో కొంత డబ్బునైనా ఉంచండి.. ఒక్క రూపాయి కూడా లేని ఇంట్లో సీసీ కెమెరాలు ఎందుకు.. సారీ సర్.. నన్ను క్షమించండి.. అని రాసుకొచ్చాడు. అది చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటన స్థానికంగా జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.