వయస్సు పెరిగే కొద్ది ప్రతి వ్యక్తి తన ప్రవర్తనను మరింత మెరుగుపర్చుకుంటాడు. సాధారణంగా ఓ 50 ఏళ్లు దాటిన వ్యక్తులు ఎంతో మందికి మార్గదర్శకంగా ఉంటూ.. యువత సరైన మార్గంలో నడిచేందుకు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. కాని తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం 73 ఏళ్ల వయసులోనూ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు. నేరం రుజువు కావడంతో పోక్సో చట్టం కింద నమోదైన కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు దోషికి జీవిత ఖైదు విధించింది. నాలుగేళ్ల క్రితం ఆరేళ్ల బాలికపై కళ్లకురిచి జిల్లాకు చెందిన 73ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు. అయినా బాలిక తన తన తల్లికి విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నేరం రుజువు కావడంతో దోషికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే..
సుమారు నాలుగేళ్ల క్రితం ఆరేళ్ల బాలికపై తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లా ఉలుందూర్‌పేట సమీపంలోని గ్రామంలో చిన్న దుకాణం నడుపుతున్న డి.నటరాజన్ అనే వ్యక్తి, చాక్లెట్లు కొనడానికి తన దుకాణానికి వచ్చిన ఆరేళ్ల బాలికకు మరిన్ని చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి.. దుకాణం వెనుక ఉన్న గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన 2018 డిసెంబర్ 26వ తేదీన జరిగింది. విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించి బాలికను విడిచిపెట్టాడు. అయితే ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఉలుందూరుపేట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు నటరాజన్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 342 (బలవంతంగా నిర్భందం) 376 (అత్యాచారం)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద అరెస్టు చేయగా.. పోక్సో చట్టంకింద నమోదైన కేసులను విచారించే ప్రత్యేక కోర్టు కేసును విచారించింది. నిందితుడు నటరాజన్ నేరానికి పాల్పడ్డాడని రుజువుకావడంతో పోక్సో చట్టం కింద నమోదైన కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సెషన్స్ జడ్జి జి.శాంతి దోషికి జీవితఖైదు విధించడంతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. ప్రాణాలతో బయటపడిన బాలికకు రూ.10,00,000 పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..