అక్టోబర్‌లో భారత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

| Edited By:

Sep 02, 2019 | 6:56 PM

వచ్చే నెల అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య అనధికారిక శిఖరాగ్ర సమావేశం జరగనున్నట్టు ప్రభుత్వ ఉన్నత వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. ఈ సమావేశానికి తమిళనాడులోని తీరప్రాంతం మామల్లపురం వేదిక కానున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల శిఖరాగ్ర సమావేశానికి ఆయా దేశాల అగ్ర నాయకులు హజరుకానున్నారు. అయితే చైనా అధ్యక్షుడి జిన్ ‌పింగ్ కు ఆతిథ్యం ఇవ్వగల పట్టణాల్లో మామల్లపురం ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో  చైనా […]

అక్టోబర్‌లో భారత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
Follow us on

వచ్చే నెల అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య అనధికారిక శిఖరాగ్ర సమావేశం జరగనున్నట్టు ప్రభుత్వ ఉన్నత వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. ఈ సమావేశానికి తమిళనాడులోని తీరప్రాంతం మామల్లపురం వేదిక కానున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల శిఖరాగ్ర సమావేశానికి ఆయా దేశాల అగ్ర నాయకులు హజరుకానున్నారు. అయితే చైనా అధ్యక్షుడి జిన్ ‌పింగ్ కు ఆతిథ్యం ఇవ్వగల పట్టణాల్లో మామల్లపురం ఒకటిగా అధికారులు పేర్కొన్నారు.

గత ఏడాది ఏప్రిల్ నెలలో  చైనా హుహాన్ నగరంలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమై భారత్ చైనా మైత్రి బలోపేతంపై చర్చించారు. వీరి చర్చలు ఇరుదేశాల పటిష్టతకు సహకరించాయి. ఈసారి రెండు రోజులపాటు జరిగే అనధికార శిఖరాగ్ర సమావేశాల కోసం ఆయన భారత్‌కు రానుండటం చర్చనీయాంశంగా మారింది.

మామల్లపురం.. దీనినే మహాబలిపురం అని కూడా పిలుస్తారు. ఇది వివిధ పురాతన దేవాలయాలకు, స్మారక చిహ్నాలకు ప్రతీకగా మామల్లపురం చరిత్రలో నిలిచింది.