CM M K Stalin: అవయవ దాతలకు తమిళనాడు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు.. సీఎం స్టాలిన్ నిర్ణయంపై సర్వత్రా హర్షం

|

Sep 24, 2023 | 7:12 AM

తమిళనాడులో ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాదరణను చూరగొంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవయవదానం చేసిన వారికీ ఇక నుంచి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నామని సీఎం వెల్లడించారు. 

CM M K Stalin: అవయవ దాతలకు తమిళనాడు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు.. సీఎం స్టాలిన్ నిర్ణయంపై సర్వత్రా హర్షం
Organ Donors
Follow us on

అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న. మనం మరణిస్తూ మరొకరికి జీవితాన్ని గడిపే అవకాశం ఈ అవయవదానం ఇస్తుంది. క్రమంగా దేశంలో అవయవదానం మీద అవగాహనా పెరుగుతోంది. దీంతో స్వచ్చందంగా తమ ఆర్గాన్స్ ను డొనేషన్ చేయడానికి అనేకమంది ముందుకొస్తున్నారు. అంతేకాదు తమ ఫ్యామిలీ మెంబర్ ఇక బతకడు అని తెలిసిన ఫ్యామిలీ కూడా తమ బాధని గుండెల్లో దాచుకుని.. అవయవాలని ఇచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్గాన్స్ డొనేషన్ చేసిన వారి పార్దీవ దేహానికి ఇక నుంచి ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ చెప్పారు. వాస్తవంగా అవయవ దానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉంది.

తమిళనాడులో ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాదరణను చూరగొంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవయవదానం చేసిన వారికీ ఇక నుంచి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నామని సీఎం వెల్లడించారు.

అవయవ దానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉంది. విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మరణానంతర అవయవదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలి. మిగిలిన వాళ్లు కూడా అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలి. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్‌ డోనర్స్‌ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్టాలిన్‌ తెలిపారు.

పుట్టిన వాడు మరణించక తప్పదు. అయితే పుట్టుక ఎలా ఉన్నా మరణం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పలేం. చాలా మంది తమ మరణం ఇలా ఉండాలని కోరుకుంటారు. మంచాన పడకుండా, నిద్రలోనే ప్రాణం విడవాలని ఆశిస్తుంటారు. ఎవరికైనా సరే మరణం తప్పనిసరి అని తెలుసు..అందుకనే తమ జీవితం చివరి అంకం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని.. మరణం సునాయాసంగా రావాలని.. చివరి మజిలీ ప్రశాంతంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరును భావిస్తూ ఉంటారు. అయితే  ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలను అతి తక్కువ మందికి మాత్రమే జరుపుతారు. సెలబ్రెటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు, దేశంకోసం ప్రాణాలు విడిచిన అమరవీరులు వంటి అరుదైన వ్యక్తులు మాత్రమే ఇటువంటి గౌరవ ప్రదమైన జరిగే అంతిమ సంస్కారాలను అందుకుంటారు. అందుకే చాలా తక్కువ మంది ప్రముఖులకు మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం ఆర్గాన్‌ డోనర్స్‌ అంతిమ సంస్కారాల విషయంలో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..