దారుణం.. ఎలుక‌ల మందు తిని 50 నెమ‌ళ్లు మృతి! ఎక్కడంటే

Peacocks Died in Tamil Nadu: నెమళ్లు గుంపుగా వచ్చి పొలంలోని పంటను తినేస్తున్నాయని ఓ రైతు ఎలుక‌ల మందు పెట్టాడు. అయితే ఆ మందు తినేసిన 50 నెమ‌ళ్లు ఒక్క రోజులోనే మృతి చెందాయి. దీంతో అటవీ శాఖ అధికారులు సదరు రైతును అరెస్టు చేసి, పోలీసులకు అప్పగించారు. త‌మిళ‌నాడులోని తెన్‌కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఈ దారుణం

దారుణం.. ఎలుక‌ల మందు తిని 50 నెమ‌ళ్లు మృతి! ఎక్కడంటే
Peacocks Died In Tamil Nadu

Updated on: Oct 26, 2025 | 8:13 PM

చెన్నై, అక్టోబర్ 26: నెమళ్లు గుంపుగా వచ్చి పొలంలోని పంటను తినేస్తున్నాయని రైతు ఎలుక‌ల మందు పెట్టాడు. అయితే మందు తినేసిన 50 నెమ‌ళ్లు ఒక్క రోజులోనే మృతి చెందాయి. దీంతో అటవీ శాఖ అధికారులు సదరు రైతును అరెస్టు చేసి, పోలీసులకు అప్పగించారు. త‌మిళ‌నాడులోని తెన్‌కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..

తెన్‌కాశీ జిల్లా ప‌రిధిలోని తిరువెంకడం సమీపంలో మీనాక్షిపురం గ్రామానికి చెందిన జాన్స‌న్ అనే రైతు త‌న‌కున్న ఎక‌రా పొలంలో మొక్క‌జొన్న సాగు చేశాడు. అయితే పంట ఏపుగా పెరిగి చేతికి వ‌చ్చే స‌మ‌యం దగ్గర పడటంతో ప‌క్షులు, జంతువులు, అడవి పందులు పొలంలోకి ప్రవేశించి పంటను తినేస్తున్నాయి. దీంతో జాక్సన్వీటి నుంచి పంట‌ను కాపాడుకునేందుకు ఆహార ప‌దార్థాల్లో ఎలుక‌ల మందు కలిపి పొలం చుట్టూ అక్కడక్కడ ఉంచాడు. అనంతరం సదరు మొక్క‌జొన్న చేను వ‌ద్ద‌కు వ‌చ్చిన నెమ‌ళ్లు ఆ ఆహార ప‌దార్థాల‌ను తినేశాయి. దీంతో అవి పొలం సమీపంలో కుప్పలు తెప్పలుగా పడి ప్రాణాలు విడిచాయి. నెమ‌ళ్లు మృతి చెందిన స‌మాచారం అందుకున్న పులియాంగుడి అటవీ శాఖ అధికారులు పోలీసుల‌తో పాటు జాన్స‌న్ పొలం వ‌ద్ద‌కు వెళ్లారు.

పశువైద్య అధికారుల సహాయంతో మృతి చెందిన నెమళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50 వ‌ర‌కు నెమ‌ళ్లు మృతి చెందినట్లు అట‌వీశాఖ అధికారులు లెక్క తేల్చారు. నెమ‌ళ్ల క‌ళేబ‌రాల‌ను అట‌వీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యాధికారులు వాటికి పోస్టు మార్టం నిర్వహించగా అవి విషప్రయోగం వల్ల చనిపోయినట్లు నిర్ధారణ అయింది. దీంతో జాతీయ పక్షి అయిన నెమళ్ల మృతికి కారణం అయినందున పోలీసులు రైతు జాన్స‌న్‌ను అరెస్టు చేశారు. ప్రమాదకరంగా పంటలను కాపాడుకోవడానికి ఎలుక మందు వాడటం వల్లనే నెమళ్లు మృతి చెందాయని తెలిపారు. సంఘటన తెన్కాసి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

Peacocks Died In Tamil Nadu

కాగా తెన్కాసి జిల్లాలోని తిరువెంకడం, శంకరన్ కోవిల్ రైతులు మొక్కజొన్న, మినుములు, పెసలు, వేరుశనగ, జొన్న, రాగులను పండిస్తుంటారు. దీంతో అనేక పక్షులు పంటపై చేరి వాటిని ఇష్టారీతినా ఆరగిస్తున్నాయి. దీంతో అడవి పందులు, పక్షులు, ఇతర జంతువులు తమ పొలాల్లోకి ప్రవేశించి పంటలకు నష్టం కలిగించకుండా నిరోధించడానికి అక్కడి రైతులు పలు నివారణ చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్చేయండి.