Amit Shah on Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా.. నమ్సాయి జిల్లాలో రూ.1,000 కోట్ల విలువైన విలువైన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి అమిత్ షా.. సీఎం పెమా ఖండూతో కలిసి ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఏం జరిగిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని.. అయితే.. వారు కళ్లు మూసుకుని, మెలకువగా ఉన్నారంటూ విమర్శించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ.. తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి ప్రధాని మోదీ, స్థానిక సీఎం పెమా ఖండూ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలి అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో గత ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, శాంతి భద్రతల బలోపేతానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని అమిత్ షా పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో ప్రధాని మోడీ, సీఎం పెమా ఖండూ చేసిన పనులు.. గత 50 ఏళ్లలో జరగలేదని షా అభిప్రాయపడ్డారు.
BJP’s double engine govt in Arunachal Pradesh under the leadership of @narendramodi Ji and @PemaKhanduBJP Ji has done what the previous governments could not do in the last 50 years.
Today inaugurated and laid the foundation stone of projects worth ₹1000 crores in Namsai. pic.twitter.com/x2qLPl7Acn
— Amit Shah (@AmitShah) May 22, 2022
రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ఉన్న అమిత్ షా.. ముందుగా గోల్డెన్ పగోడాను సందర్శించారు. ఆయన వెంట కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితర నాయకులు ఉన్నారు. ఈ పర్యటనలో అమిత్ షా.. రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు, అభివృద్ధిని సమీక్షించడంతోపాటు ఆర్మీ, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్, అస్సాం రైఫిల్స్ సిబ్బందితో భేటీ కానున్నారు.