Tajmahal 22 Rooms: ఆగ్రా లోని తాజ్‌మహల్‌లో తాళం వేసిన 22 రహస్య గదుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత పురావస్తు శాఖ కీలక ఫోటోలు విడుదల చేసింది. తవ్వకాలు చేపట్టడం లేదని, శిథిలమైన కట్టడాల పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగిందని పురావస్తు శాఖ సూపరింటెండెంట్ తెలిపారు.
కాగా, 22 రహస్య గదుల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ గదుల్లో హిందూ దేవతల ప్రతిమలు, వస్తువులు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. అక్కడ ఉన్న శివాలయాన్ని కూల్చివేసి తాజ్‌మహల్‌ను నిర్మించారనే వాదన కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజ్‌మహల్‌లో మూసివేసిన 22 గదుల అంశం తాజాగా బయటకు వచ్చింది. ఈ గదుల వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. అలహాబాద్ కోర్టులో ఈ రహస్య గదులను తెరవాలనే పిటిషన్ దాఖలవగా.. కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ అంశం ఇలా ఉంటే.. తాజాగా భారత పురావస్తు శాఖ షాకింగ్ ఫోటోలను విడుదల చేసింది. తాజ్ మహల్‌లో రహస్య గదులకు సంబంధించిన, ఇతరు ప్రాంతాల ఫోటోలను ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోల్లో పురావస్తు కట్టడాల పునరుద్ధరణ పనులకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ఆర్కియాలజీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘డిసెంబర్, 2021, మార్చి 2022 మధ్య అధికారులు చారిత్రక కట్టడమైన తాజ్ మహల్, దాని పరిధిలో కట్టడాల పునరుద్ధన పనులు చేపట్టడం జరిగింది. దానికి సొంబంధించిన ఫోటోలు అందరూ చూడటానికి వీలుగా ASI వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగింది. నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ భూగర్భ కణాల నిర్వహణ పనులు కొన్ని నెలల క్రితం చేపట్టాం. పాడైపోయిన, శిథిలమైన సున్నపు ప్లాస్టర్‌ను తొలగించి, ఆధునీకరించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు.
Click on the link to download/view the January issue of @ASIGoI‘s Newsletter.https://t.co/tIJmE46UR4 pic.twitter.com/UKWsTA2nPZ
— Archaeological Survey of India (@ASIGoI) May 9, 2022