
16ఏళ్లుగా ఎవడి కోసమైతే ప్రతి భారతీయుడి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడో ఆతరణం రానే వచ్చింది. 26/11 ముంబయి దాడుల కీలక సూత్రధారి తహప్వూర్ రాణా భారత్‌కు రప్పించారు. నిందితుల అప్పగింత ప్రక్రియలో భాగంగా రాణా ఇండియాకు రావడంతో..ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాణాను తీసుకువస్తోన్న విమానం ఎయిర్‌పోర్డులో ల్యాండ్ కాగానే.. అతడిని అరెస్ట్ చేసి NIA ఆఫీసుకు తీసుకెళ్లారు.డిల్లీకి చెందిన స్పెషల్ సెల్‌ను అలర్ట్‌లో ఉంచారు. రాణా ఎయిర్‌పోర్టు దిగే సమయంలో SWAT కమాండోలను కూడా మోహరించారు. అంతేకాదు మహింద్రాకు చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తరలించారు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేలా భారీ బందోబస్తు మధ్య రాణాను తరలించారు. రాణా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్టయిన రాణాను అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు 16 ఏళ్లకు భారత్‌కు తీసుకొచ్చారు. ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోన్న ఈకేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్ నియమితులయ్యారు. ముంబయి దాడి వెనుక పాకిస్థాన్ నాయకుల పాత్రను నిర్ధరించే దిశగా విచారణ ఉండనుంది. తహవూర్ హుస్సేన్ రాణా. 1960 ఫిబ్రవరి 12న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని చిచావత్నీలో పుట్టాడు. తండ్రి ప్రముఖ విద్యావేత్త, రాణా పాకిస్థాన్ ఆర్మీలో మెడికల్ కార్ప్స్‌లో డాక్టర్‌గా పనిచేసేవాడు. తర్వాత 1990లో కెనడాకు వలస వెళ్లాడు, అక్కడ పౌరసత్వం పొందాడు. తర్వాత అమెరికాలోని చికాగోలో స్థిరపడ్డాడు. అక్కడే ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనే కంపెనీని...