ట్విట్టర్ క్వీన్‌గా పేరున్న సుష్మా.. ఎవరిని ఫాలో అయ్యారో తెలుసా…

బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను ప్రపంచమంతా గుర్తుచేసుకుంటుంది. విదేశాంగ మంత్రిగా పనిచేసిన కాలంలో అనేక మందికి ట్విట్టర్ ద్వారా దగ్గరయ్యారు. బాధితులను ఆదుకునేందుకు కూడా ఆమె ట్విట్టర్‌నే వేదికగా చేసుకునేవారు. ఎవరైనా ట్వీట్ ద్వారా ఆమెకు ఏదైనా సమస్యను విన్నవిస్తే వెంటనే స్పందించేవారు. ట్విట్టర్‌లో ఆమెకు 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇంత మంది ఫాలోవర్లు ఉన్న ఆమె.. ఇంతవరకూ ఎవరినీ […]

ట్విట్టర్ క్వీన్‌గా పేరున్న సుష్మా.. ఎవరిని ఫాలో అయ్యారో తెలుసా...

Edited By:

Updated on: Aug 07, 2019 | 1:43 PM

బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను ప్రపంచమంతా గుర్తుచేసుకుంటుంది. విదేశాంగ మంత్రిగా పనిచేసిన కాలంలో అనేక మందికి ట్విట్టర్ ద్వారా దగ్గరయ్యారు. బాధితులను ఆదుకునేందుకు కూడా ఆమె ట్విట్టర్‌నే వేదికగా చేసుకునేవారు. ఎవరైనా ట్వీట్ ద్వారా ఆమెకు ఏదైనా సమస్యను విన్నవిస్తే వెంటనే స్పందించేవారు. ట్విట్టర్‌లో ఆమెకు 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

ఇంత మంది ఫాలోవర్లు ఉన్న ఆమె.. ఇంతవరకూ ఎవరినీ ఫాలో చేయలేదు. అలాగే ఏ ట్వీట్‌కూ లైక్ చేయకపోవడం విశేషం. సుష్మా స్వరాజ్ విదేశాంగశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తనదైన పనితీరుతో ప్రత్యేక ముద్రవేశారు. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయ నర్సులను సురక్షితంగా తీసుకువచ్చి పలువురి అభినందనలు అందుకున్నారు.