Sushil Chandra: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర.. రేపు బాధ్యతలు చేపట్టనున్న సీఈసీ

|

Apr 12, 2021 | 8:12 PM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోడా పదవీకాలం నేటితో ముగిసింది.

Sushil Chandra: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర.. రేపు బాధ్యతలు చేపట్టనున్న సీఈసీ
Sushil Chandra Appointed As Cec
Follow us on

Sushil Chandra as CEC: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోడా పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్రను కొత్త సీఈసీగా నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీగా సుశీల్‌ చంద్ర మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రేపటి నుంచి వచ్చే ఏడాది మే 14వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.


కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని అనుసరించి ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్రను సీఈసీగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. సుశీల్‌ చంద్ర నేతృత్వంలోనే గోవా, మణిపుర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సుశీల్‌ చంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

Read Also..

Manchu Vishnu praised CM KCR: తెలంగాణ సర్కార్‌కు మంచు విష్ణు ఫిదా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ట్వీట్టర్ వేదికగా ప్రశంసలు

South Sudan Tribes Worship Cow: ఆ దేశంలోని ఆటవిక తెగవారు ఆవును పవిత్రమైన జంతువుగా పూజిస్తారు.. ఎందుకంటే..!