డ్రగ్స్ కేసులో శ్రధ్ధా కపూర్, సారా అలీఖాన్ లకు సమన్లు ?

సుశాంత్ కేసు నేపథ్యంలో రియా చక్రవర్తి డ్రగ్స్ కేసు కూడా అదనంగా చేరడంతో రియా విచారణలో బయటపెట్టిన తారలను ఇంటరాగేట్ చేసే పనిలో పడింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.

డ్రగ్స్ కేసులో శ్రధ్ధా కపూర్, సారా అలీఖాన్ లకు సమన్లు ?

Edited By:

Updated on: Sep 21, 2020 | 2:03 PM

సుశాంత్ కేసు నేపథ్యంలో రియా చక్రవర్తి డ్రగ్స్ కేసు కూడా అదనంగా చేరడంతో రియా విచారణలో బయటపెట్టిన తారలను ఇంటరాగేట్ చేసే పనిలో పడింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ క్రమంలో బాలీవుడ్ తారలు శ్రధ్ధా కపూర్, సారా అలీఖాన్ లకు ఈ సంస్థ  త్వరలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. రియా చక్రవర్తిని ఈ నెల 9 న అరెస్టు చేశారు. అటు-59 గ్రాముల మార్జువానాను  స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ… మొత్తం 15 మందిని అరెస్టు చేసి రెండో కేసు కూడా నమోదు చేసింది. వీరిలో సుశాంత్ మాజీ మేనేజర్లు ఇద్దరు,  కొందరు డ్రగ్ డీలర్లు కూడా ఉన్నారు. ఇక సోమవారం.. సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీ, జయా సాహా ని ఇంటరాగేట్ చేస్తున్నారు. గతంలో వీరిని విచారించినప్పటికీ మళ్లీ ఇందుకు వీరికి కబురు పంపింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us