సుశాంత్ కేసులో రియా తలిదండ్రుల ఇంటరాగేషన్ !

| Edited By: Anil kumar poka

Sep 01, 2020 | 2:14 PM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి బదులు ఆమె తలిదండ్రులు ఇంద్రజిత్ చక్ర వర్తి, సంధ్యా చక్రవర్తిని సీబీఐ అధికారులు మంగళవారం విచారించారు.

సుశాంత్ కేసులో రియా తలిదండ్రుల ఇంటరాగేషన్ !
Follow us on

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి బదులు ఆమె తలిదండ్రులు ఇంద్రజిత్ చక్ర వర్తి, సంధ్యా చక్రవర్తిని సీబీఐ అధికారులు మంగళవారం విచారించారు. నాలుగు రోజులపాటు రియాను, ఆమె సోదరుడు షోవిక్  చక్రవర్తిని వారు ఇంటరాగేట్ చేశారు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా రియాను వారు మొత్తం సుమారు 35 గంటలపాటు తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అలాగే శృతి మోడీ, సిద్దార్థ్ పితాని కూడా ఇంటరాగేషన్ ని ఎదుర్కొన్నారు.  తాజాగా నిన్న డ్రగ్  డీలర్, గోవా హోటల్ యజమాని గౌరవ్ ఆర్యను కూడా సీబీఐ ప్రశ్నించింది. అయితే ఇలా రోజుల తరబడి విచారణలు జరుగుతున్నప్పటికీ..సుశాంత్ తండ్రి కేకే ఖాన్ ప్రధానంగా రియాపై చేసిన ఆరోపణల లోని నిజానిజాలు తేలలేదు. తన కుమారుని బ్యాంకు ఖాతా నుంచి రియా రూ. 15 కోట్లను తన ఖాతాకు మళ్లించుకుందని, ఆత్మహత్యకు అతడిని ప్రేరేపించిందని ఆయన ఫిర్యాదు చేశాడు. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఆ బ్యాంకు ఏదన్న విషయంగానీ,  అది ముంబైలో ఏ ప్రాంతంలో ఉందని గానీ సంబంధిత వివరాలు ఇప్పటివరకు బయటకు పొక్కలేదు.