సుప్రీంకోర్టుకు సూపర్ డే.. ఒక్కరోజే..?

|

Nov 13, 2019 | 4:53 PM

వరుసగా చారిత్రాత్మక తీర్పులిస్తూ చిరకాలంగా పెండింగ్‌లో వున్న వివాదాలను పరిష్కరిస్తూ వస్తున్న సుప్రీంకోర్టుకు గురువారం సూపర్ డే కాబోతోంది. ఎందుకంటే ఒకే రోజు మూడు ప్రధాన కేసులలో తీర్పు వెలువరించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ కార్యాలయం. నవంబర్ 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజయ్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పలు ప్రధాన కేసుల పరిష్కారానికి ఆయన నడుం బిగించిన సంగతి తెలిసిందే.గురువారం తీర్పులు వెలువడనున్న కేసుల్లో ప్రధానమైనది శబరిమల ఆలయంలోకి యుక్త […]

సుప్రీంకోర్టుకు సూపర్ డే.. ఒక్కరోజే..?
Follow us on

వరుసగా చారిత్రాత్మక తీర్పులిస్తూ చిరకాలంగా పెండింగ్‌లో వున్న వివాదాలను పరిష్కరిస్తూ వస్తున్న సుప్రీంకోర్టుకు గురువారం సూపర్ డే కాబోతోంది. ఎందుకంటే ఒకే రోజు మూడు ప్రధాన కేసులలో తీర్పు వెలువరించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ కార్యాలయం. నవంబర్ 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజయ్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పలు ప్రధాన కేసుల పరిష్కారానికి ఆయన నడుం బిగించిన సంగతి తెలిసిందే.గురువారం తీర్పులు వెలువడనున్న కేసుల్లో ప్రధానమైనది శబరిమల ఆలయంలోకి యుక్త వయసు మహిళల ఎంట్రీకి సంబంధించిన వివాదం. ఈ కేసులో సుప్రీం కోర్టు 2018 సెప్టెంబర్ 18న తీర్పు నివ్వగా పలు హిందూ సంఘాలు, ట్రావెన్ కోర్ దేవస్వోం బోర్డు ప్రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. 10-50 ఏళ్ళ మహిళలను శబరిమల అయ్యప్పగుడిలోకి అనుమతించాలని ఆదేశించగా.. పలు హిందూసంస్థలు.. ఆలయాల్లో కోర్టుల జోక్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయితే కేరళ ప్రభుత్వం పూర్తి భద్రత మధ్య కొందరు మహిళలు ఇప్పటికే శబరిమల ఆలయంలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.

ఆలయం తిరిగి ఈ నెల 16వ తేదీన సాయంత్రం తెరుచుకుని, 17వ తేదీ నుంచి భక్తులకు అయ్యప్పస్వామి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో గురువారం వెలువడే తీర్పు అత్యంత కీలకం కాబోతోంది. తీర్పు వెలువడే సంకేతాలు రావడంతో శబరిమలతోపాటు కేరళ వ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

ఇక గురువారం తీర్పు రానున్న మరో కేసు..రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సారథ్యంలోని స్పెషల్ బెంచ్ విచారించింది. గురువారం స్పెషల్ బెంచ్ తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ తీర్పు అయితే కాంగ్రెస్ పార్టీకి, లేదా బిజెపికి ఓ ఒకరిపై మరొకరు అటాక్ చేసేందుకు అస్త్రంగా మారే అవకాశాలున్నాయి.

ఇక మూడో కేసు.. రాహుల్ గాంధీ వ్యక్తి గతానికి సంబంధించింది. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దొంగ అభివర్ణిస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై దాఖలైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వివాదానికి సంబంధించింది ఈ తీర్పు. పలు సందర్భాలలో మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ‘‘ చౌకీ దార్ చోర్ హై ’’ అన్న కామెంట్ చేశారు. అయితే.. రాఫెల్ కొనుగోళ్ళపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు రాహుల్ ఆ మాటను అనరాదని చాలా స్పష్టంగా ఆదేశించింది.

అయితే ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ పలు మార్లు ‘‘ చౌకీ దార్ చోర్ హై ’’ అంటూ కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పినా రాహుల్ గాంధీ ఆ మాటల్ని పదే పదే అనడంతో బిజెపి నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కూడా రేపు సుప్రీం ధర్మాసనం గురువారం తీర్పు ఇవ్వబోతోంది.

మొత్తానికి గురువారం తీర్పులు సుప్రీం చరిత్రలో చారిత్రాత్మకం కాబోతున్నాయి. నవంబర్ 17న పదవీ విరమణకు ముందు ఇక మిగిలింది 3 వర్కింగ్ డేస్ మాత్రమే. గురువారం మూడు తీర్పులు వెలువడితే.. ఇక మిగిలింది.. ఒకే ఒక్క ప్రధానమైన కేసు ఫైనాన్స్ బిల్లుకు సంబంధించిన వివాదంపై దాఖలైనది. శుక్ర, శనివారాల్లో ఫైనాన్స్ బిల్లుపై దాఖలైన పిటిషన్‌పై కూడా తీర్పు వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది.