Supreme Court: సుప్రీంకోర్టునే ఏమార్చాడు.. ఎట్టకేలకు అడ్డంగా బుక్కయ్యాడు.. అసలేం జరిగిందంటే..

|

Dec 27, 2020 | 5:17 AM

సుప్రీంకోర్టు పరిధిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్నే ఏమార్చాలని ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డాడు ఓ వ్యక్తి.

Supreme Court: సుప్రీంకోర్టునే ఏమార్చాడు.. ఎట్టకేలకు అడ్డంగా బుక్కయ్యాడు.. అసలేం జరిగిందంటే..
Follow us on

Supreme Court: సుప్రీంకోర్టు పరిధిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్నే ఏమార్చాలని ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డాడు ఓ వ్యక్తి. చివరికి ఆ ప్రయత్నం అతని మెడకే చుట్టుకుంది. మీపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో ఓ కేసులో ఎస్. శంకర్ అనే వ్యక్తి ఏ5గా ఉన్నాడు. అయితే ఈ కేసును విచారించిన హైదరాబాద్ సీబీఐ కోర్టు అతనికి ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. దీన్ని సవాల్ చేస్తూ శంకర్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులోనూ అతనికి చుక్కెదురైంది. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు ఇలా ఉంటే అసలు మ్యాటర్ ఇప్పుడై మొదలైంది.

హైకోర్టులోనూ లాభం లేదనుకున్న శంకర్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈసారి ఎలాగైనా కేసు నుంచి బయటపడాలని ప్లాన్ వేశాడు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందంటూ ధర్మాసనానికి మొరపెట్టుకున్నాడు. నిందితులకు వెయ్యి రూపాయల జరిమానా ‘లేదా’ ఏడాది జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ మేరకు నకిలీ పత్రాలను సైతం సమర్పించాడు. సీబీఐ కోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికే జరిమానా కూడా చెల్లించానని కోర్టుకు తెలిపాడు. దాంతో నిందితుడి వాదనలను సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అతన్ని విడుదల చేయాలంటూ ఆదేశించింది.

ఇదంతా ఇలా ఉంటే.. అసలు ఈ కేసుపై పూర్తిగా పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని తన సెక్రటరీ జనరల్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసు పూర్వపరాలు, తీర్పులు అన్నీ పరిశీలించిన సెక్రటరీ జనరల్ అసలు విషయాన్ని తేల్చారు. నిందితుడు చేసిన మోసాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో నిందితుల చర్యపై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినందుకు, కింది కోర్టు తీర్పును వక్రీకరించి నకిలీ పత్రాలను సమర్పించినందుకు.. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ నిందితుడు శంకర్‌కు, సదరు న్యాయవాదికి ద్విసభ్య ధర్మాసనం షోకాజ్‌ నోటీసు జారీచేసింది.

 

Also read:

నేపాల్ రాజకీయాల్లో డ్రాగన్‌ కంత్రీ పనులు..ఎన్‌సీపీని కాపాడేందుకు ఆ దేశంలోకి చైనా దూతల ఎంట్రీ

యాభై ఐదో వసంతంలోకి అడుగెడుతున్న కండల వీరుడు.. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తున్న సల్లూ భాయ్..