
కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల గ్రామం.. మణితేజ అనే ఎనిమిదేళ్ల పసివాడు. వన్ బ్యాడ్ మార్నింగ్ విధి వికటించి, ఆ చిన్నోడ్ని వీధికుక్క కరిచింది. వెంటనే సర్కారీ దవాఖానాకు వెళ్లి టీకా వేయించి, ఇంటికి తీసుకొచ్చారు పేరెంట్స్. కానీ, మరుసటిరోజు విపరీతంగా జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ్నుంచి హైదరాబాద్ తీసుకెళ్లి 50 లక్షలు ఖర్చుపెట్టి ట్రీట్‌మెంట్ ఇచ్చినా ఫలితం లేదు. 15 నెలలపాటు మంచంలోనే ఉండి, అమ్మానాన్నలకు వందేళ్ల కష్టాన్ని మిగిల్చి చివరాఖరికి చావుకు లొంగిపోయాడు. వీధికుక్కల కాటుకు బలైపోయి కాటికి చేరిన ఇటువంటి చిన్నారుల కన్నీటికథలు వందలు కాదు వేలల్లో ఉంటాయ్. ఒకదాన్ని మించి మరొకటి విషాదగాధలు. కానీ, మూగజీవాలు వాటికేం తెలుసు, వాటి కళ్లల్లోకి చూడండి, వాటి అమాయకత్వాన్ని కూడా లెక్కలేయండి అనే జంతుప్రేమికుల కరుణాకటాక్షాలు ఇంకోవైపు. వీధికుక్కల్ని ఏరివేయాల్సిందేనని, ఊరికి దూరంగా పంపాలని, వీలైతే చట్టాలు మార్చాలని డిమాండ్లు, అటూఇటూ పిటిషన్లు-కోర్టు తీర్పులు, గాల్లోకి చూస్తూ టైమ్‌పాస్ చేస్తున్న ప్రభుత్వాలు.. మొత్తంగా ఒక జాతీయ సంక్షోభంగా మారింది మన దేశంలో వీధికుక్కల బెడద. >>రేబిస్ సోకిన కుక్కలను ఏరిపారెయ్యండి! >>ప్రమాదకరం అనిపిస్తే అక్కడికక్కడే చంపెయ్యండి! >>నివాస ప్రాంతాల్లో ఒక్క వీధికుక్కయినా కనిపించొద్దు >>దేశంలో కుక్కల సంఖ్య ఇంతకంటే పెరగొద్దు! >>కుక్కకాటుతో ఒక్క...